జగన్‌కు ఏదైనా సాధ్యమే.. మరి ఇది సాధ్యమా?  

Any Thing Is Possible To Jagan Mohan Reddy - Telugu , Ap Assembly Meetings, Ap Cm Jagan Mohan Reddy, Chandrababu Naidu, Jagan Mohan Reddy, Mandali In Three Capitals, Tdp

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తాను ఏది అనుకుంటే అది చేసుకుంటూ వెళ్తున్నాడు.అమరావతి రాజధాని కాదంటూ మూడు రాజధానులు ఏపీకి కావాల్సిందే అంటూ జగన్‌ అనుకున్నాడు.

Any Thing Is Possible To Jagan Mohan Reddy

అనుకున్నట్లుగానే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాడు.అందులో తనకున్న బలంతో నెగ్గించుకున్నాడు.

కాని ఇప్పుడు మండలిలో ఆయనకు బలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.మొదటి నుండి కూడా మండలిలో బలం లేని కారణంగా జగన్‌ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.

అందుకే మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మండలిలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టకుండా తెలుగు దేశం పార్టీ అడ్డుకోగలిగింది.

మండలిలో వైకాపాకు ఈ విషయమై పెద్ద ఎదురు దెబ్బ తలిగింది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మండలిని రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

జగన్‌ తల్చుకుంటే ఏం చేసేందుకు అయినా సిద్ద పడుతాడు.కాని ఈసారి మండలిని రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు.

కాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దు అవ్వదని రాజకీయ వర్గాల వారు అంటున్నారు.జగన్‌ మూర్ఖంగా మండలిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే పరాభవం తప్పదంటూ రాజకీయ వర్గాల వారు అంటున్నారు.

తాజా వార్తలు

Any Thing Is Possible To Jagan Mohan Reddy-ap Assembly Meetings,ap Cm Jagan Mohan Reddy,chandrababu Naidu,jagan Mohan Reddy,mandali In Three Capitals,tdp Related....