ఏ డిగ్రీ చదివినా... ఎస్జీటీ పోస్టులకు అర్హులే !  

ఏపీలో ఏ బ్యాచ్‌లర్‌ డిగ్రీ పూర్తిచేసినా డీఎస్సీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏ డిగ్రీ పూర్తి చేసిన వారైనా దరఖాస్తు చేసుకునేలా ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేర్పులు చేశారు. ఇప్పటి వరకు బీఏ, బీఎస్సీ, బీకాం.. ఈ మూడు డిగ్రీల వారికే ఎస్జీటీ పోస్టులకు అర్హత ఉండేది. ఫలితంగా బీటెక్‌, బీసీఏ, బీబీఏ.. తదితర డిగ్రీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నవారు పాఠశాల విద్యాశాఖను ఆశ్రయించారు.

ANY DEGREE HOLDERS ARE ELIGIBLE FOR SGT POSTS-

ANY DEGREE HOLDERS ARE ELIGIBLE FOR SGT POSTS

దీనిపై స్పందించిన విద్యాశాఖ.. ఏడిగ్రీ చేసినా ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఆన్‌లైన్‌ దరఖాస్తులో ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్ఏ) పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. స్కూలు అసిస్టెంట్ల(ఎస్‌ఏ)కు సంబంధించి ఇంటర్మీడియట్‌లో చదివిన సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కాగా, డీఎస్సీకి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (నవంబరు 10) వరకు 2.7 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, ఇందులో 2.45 లక్షల మంది దరఖాస్తు సమర్పిచారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 16 వరకు గడువుంది.