నిర్భయ నిందితులను ఉరి తీయకూడదంటున్న బాలయ్య బాబు హీరోయిన్...

అప్పట్లో మృగాళ్లు లాంటి వ్యక్తుల చేతిలో ఓ మహిళ దారుణంగా అత్యాచారానికి గురై తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో చివరి రోజుల్లో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలిన అటువంటి నిర్భయ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.అయితే తే ఈ ఘటనకు పాల్పడినటువంటి నిందితులకు గతంలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

 Anushree Dutta Delhi Cheppack Deepika Padukone-TeluguStop.com

అయితే ఆ శిక్షను ఇప్పటికి కూడా ఇంకా అమలు చేయలేదు.అయితే తాజాగా ఈనెల 22వ తారీఖున తిహార్ జైల్లో ముగ్గురు నిందితులను ఒకేసారి ఉరి తీయనున్నారు.

అయితే ఈ విషయంపై తాజాగా బాలయ్య బాబు హీరోయిన్ తనుశ్రీ దత్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది.నిర్భయ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడి నిర్భయకు న్యాయం జరిగింది. మంచిదే కానీ ఇలా అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరిని ఉరి తీసుకుంటూ పోతారా.? అంటూ ప్రశ్నించారు. దీని కోసమే తాను ప్రత్యామ్నాయంగా ఏదైనా వేరే పరిష్కారం ఆలోచిస్తున్నానని  అంతేగాక ఉరిశిక్ష, చావు అనేవి ఎప్పటికీ పరిష్కారం కావని అన్నారు. అత్యాచార ఘటనలకు ఫుల్ స్టాప్ పడిన రోజు కోసం నేను చాలా ఎదురు చూస్తున్నానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  అయితే వీటిపై పలువురు నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈమె చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పలువురు నిర్భయ నిందితులకు వేసిన ఉరిశిక్షను ఆపాలని మీరు కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Telugu Latesttanushree, Tanushree Dutta, Tanushreedutta-Movie

అయితే ఇప్పటికే బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఎటువంటి లైన్ లైంగిక వేధింపుల కారణంగా మీటూ ఉద్యమంలో పాల్గొని తనుశ్రీ నానా రచ్చ చేసింది.అంతేగాక తనను ప్రముఖ నటుడు నానాపటేకర్ తనను లైంగికంగా వేధించడంటూ కోర్టులో కేసు వేసింది.అయితే కేసుకి  సంబందించిన సరైన రుజువులు లేకపోవడంతో ఆ కేసు నిలబడలేదు.అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తనుశ్రీ కేసు వాదించి నటువంటి లాయర్ కూడా ఒకప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు దీంతో తన శ్రీ పరిస్థితి కంచే చేను మేసినట్లు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube