సౌత్‌లో టాప్‌ : నిశబ్దంగా అనుష్క దూసుకు పోతోంది

సోషల్‌ మీడియాలో సౌత్‌ స్టార్స్‌ హవా అంతకంతకు పెరిగి పోతుంది.బాలీవుడ్‌ స్టార్స్‌ రేంజ్‌ లో సౌత్‌ స్టార్స్‌ కూడా దూసుకు పోతున్నారు.

 Anushkha Shetty Reached The 21 Million Followers In Facebook Page, Anushkha Shet-TeluguStop.com

తాజాగా ప్రభాస్‌ ఫేస్‌ బుక్‌లో 16 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను దక్కించుకుని సౌత్‌ లో టాప్‌ హీరోగా నిలిచిన విషయం తెల్సిందే.ఇప్పుడు ఆయన మాదిరిగానే ఆయన సహనటి అయిన అనుష్క కూడా ఫేస్‌ బుక్‌లో రికార్డు సొంతం చేసుకుంది.21 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను క్రాస్‌ చేసి ఫేస్‌ బుక్‌లో సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్‌ లో టాప్‌ లో నిలిచింది.

భాగమతి చిత్రం తర్వాత చాలా నిశబ్దం అయిన అనుష్క చాలా గ్యాప్‌ తీసుకుని ‘నిశబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

గత రెండు మూడు సంవత్సరాలుగా ఆమె యాక్టివ్‌గా లేకున్నా కూడా ఆమె ఫేస్‌ బుక్‌ ఫాలోవర్స్‌ సంఖ్య అమాంతం పెరిగింది.అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను బాహుబలితో సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఫేస్‌బుక్‌ లో భారీ స్థాయిలో ఫాలోవర్స్‌ను చేసుకుంది.

నిశబ్దం చిత్రంతో పాటు మరో ద్విభాష చిత్రానికి ఈమె ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.కమర్షియల్‌ పాత్రల కంటే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే నిశబ్దం చిత్రంతో ఓటీటీ ద్వారా రాబోతుంది.

ఆ చిత్రం మరో పవర్‌ ఫుల్‌ రోల్‌లో అనుష్క కనిపించే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube