‘నిశబ్దం’ మేకర్స్‌ వ్యూహం ఏంటో అర్థం కావడం లేదే?

అనుష్క హీరోయిన్‌గా మాధవన్‌, అంజలి కీలక పాత్రల్లో నటించిన నిశబ్దం సినిమా గురించి ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు.కాని ప్రేక్షకులను నిరాశ పర్చుతూ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నిరాశ పర్చారు.

 Anushka Nisabddam Movie Create The Suspence About Release On Ott Or Theaters, A-TeluguStop.com

ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా విడుదల అవ్వడం ఖాయం అనుకున్నారు.కాని మరోసారి నిరాశ పర్చుతూ సినిమాకు కరోనా వైరస్‌ అడ్డంకిగా మారింది.

ఇప్పట్లో సినిమా విడుదల అవ్వడం సాధ్యం అయ్యే విషయం కాదనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేయించుకుంది.

Telugu Anjali, Anushkha, Producers, Madhavan, Nishabddam, Theaters, Tollywood-Mo

తాజాగా తెలుగు మరియు తమిళ వర్షన్‌లకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.గత మూడు నెలలుగా సెన్సార్‌ వారికి పని లేకుండా ఉంది.ఎట్టకేలకు వారు ఈ సినిమాకు సెన్సార్‌ చేశారు.

ఈమద్య కాలంలో సెన్సార్‌కు వెళ్లిన సినిమాగా నిశబ్దం రికార్డు సృష్టించింది.సెన్సార్‌ బోర్డు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.

త్వరలోనే సినిమాను విడుదల చేస్తామనే నమ్మకంతో వారు ఉన్నారు.

థియేటర్లు ఓపెన్‌ అయ్యేందుకు కనీసం మరో రెండు నెలల సమయం అయినా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటూ ఉంటే ఈ సినిమాకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ విషయంలో ప్రస్తుతం సస్పెన్స్‌ నెలకొంది.అసలు సినిమా థియేటర్లలో రాబోతుందా లేదంటే ఓటీటీ కోసం సెన్సార్‌ చేయించారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anjali, Anushkha, Producers, Madhavan, Nishabddam, Theaters, Tollywood-Mo

దర్శకుడు మరియు నిర్మాత మాత్రం ఖచ్చితంగా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని అంటున్నారు.తమ నిర్ణయాన్ని అతి త్వరలోనే మార్చుకుంటారా లేదంటే అప్పటి వరకు వెయిట్‌ చేస్తారా అనేది చూడాలి.అప్పటి వరకు వెయిట్‌ చేసేది అయితే ఇప్పుడే సెన్సార్‌ చేయించాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube