నాకు మూడు నెలలకోసారి పెళ్లి చేస్తూనే ఉన్నారు.... అనుష్క సంచలన వ్యాఖ్యలు...!  

Anushkha Comments On Her Marriage - Telugu Anushkha, Anushkha Entry With Super Movie, Anushkha In Nishabdham, Anushkha Marriage Update, Nishabdham Latest Update, Social Media Focus On Anushkha Marriage

దాదాపు 15 సంవత్సరాల క్రితం సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు అనుష్క.కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన అనుష్క అరుంధతి సినిమా తరువాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించారు.

 Anushkha Comments On Her Marriage

అనుష్క కెరీర్ మొదలుపెట్టి 15 సంవత్సరాలు కావడంతో పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు పెళ్లి అని మీడియాలో ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయని పెళ్లి గురించి తనకు తెలియకపోయినా మీడియా వాళ్లకు తెలుస్తోందని అన్నారు.

నాకు మూడు నెలలకోసారి పెళ్లి చేస్తూనే ఉన్నారు…. అనుష్క సంచలన వ్యాఖ్యలు…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి అతి ముఖ్యమైనవని ఎవరినైనా ప్రేమించినా, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా తనకు దాచాల్సిన అవసరం లేదని తెలిపారు.ప్రతి మూడు నాలుగు నెలలకొకసారి పెళ్లి అంటూ తనపై వార్తలు వస్తున్నాయని మీడియా వాళ్లే తనకు పెళ్లి చేసేశారని అన్నారు.

తాను వార్తలు చూడనని, పేపర్ చదవనని ఎవరో చెబితే మాత్రమే తనపై వస్తున్న వార్తల గురించి తెలుస్తుందని అన్నారు.ఒక దర్శకుడు తాను ఒక క్రికెటర్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్త వచ్చిందని చెప్పారని తనకు ఎలా స్పందించాలో అర్థం కాలేదని అన్నారు.తన వ్యక్తిగత విషయాల గురించి కల్పించి వార్తలు ఎందుకు రాస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.తన గురించి రాసేవాళ్లకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా… వాళ్ల గురించి అలా రాస్తే ఫీల్ అవ్వరా.? అని అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushkha Comments On Her Marriage Related Telugu News,Photos/Pics,Images..

footer-test