వెబ్ సిరీస్ కి ఆసక్తి చూపించని స్వీటీ.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్  

Anushka rejects web series proposal, Tollywood, OTT Platform, Telugu Cinema, Digital entertainment - Telugu Anushka Rejects Web Series Proposal, Digital Entertainment, Ott Platform, Telugu Cinema, Tollywood

ఒటీటీల హవా మొదలైన తర్వాత హీరోలు, హీరోయిన్స్ అందరూ వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.ఎక్కువగా ఫేడ్ అవుట్ భామలు తమ మార్కెట్ పెంచుకోవడానికి నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Anushka Tollywood Ott Platform Telugu Cinema Digital Entertainment

అలాగే వెబ్ సిరీస్ లు అయితే కంటెంట్ బేస్ ఉంటాయి కాబట్టి తమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించేందుకు, నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.అలాగే స్టార్ దర్శకులు కూడా కమర్షియల్ జోనర్ నుంచి బయటకి వచ్చి తమలోని క్రియేటివిటీని చూపించుకోవడానికి వెబ్ సిరీస్ లు ఒక అవకాశంగా భావిస్తున్నారు.

దీంతో ఎక్కువమంది వీటిపై శ్రద్ధ చూపిస్తున్నారు.ఇక కరోనా సిచువేషన్ కూడా ఒటీటీ చానల్స్ హవా పెరగడానికి కారణం అయ్యాయి.

వెబ్ సిరీస్ కి ఆసక్తి చూపించని స్వీటీ.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్-Movie-Telugu Tollywood Photo Image

వెబ్ సిరీస్ లకు క్రేజ్ అమాంతం పెరగడంతో అగ్ర తారలు ఇప్పటికే వీటిలో నటించేందుకు క్యూ కడుతున్నారు.తాజాగా అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందని టాక్.

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అనుష్కకి సదరు చానల్ వారు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారని తెలుస్తుంది.అయితే ఆమె తనకి వెబ్ సిరీస్ లో నటించే ఉద్దేశ్యం లేదని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.

బహు భాషల్లో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితే సరిపోతుందని నిర్మాతలు భావించి ఆమెని సంప్రదించారని టాక్.కానీ అనుష్క మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు.ఆమె వీలైనన్ని సినిమాలు చేసి పెళ్లి చేసుకొని గృహిణిగా కొత్త జీవితం ప్రారంభించాలని చూస్తుంది.ఈ ఉద్దేశ్యంతోనే వెబ్ సిరీస్ లో చేయడానికి అయిష్టత చూపించిందని సమాచారం.

#OTT Platform

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Tollywood Ott Platform Telugu Cinema Digital Entertainment Related Telugu News,Photos/Pics,Images..