తమన్నా వద్దని, అనుష్క ముద్దని  

Anushka To Replace Tamannah In Krishna Vamsi Next ? -

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి తిరిగి పూర్వ వైభవాన్ని సాధించే సన్నాహాల్లో పడ్డారు.ఒకప్పుడు సింధూరం, అంతఃపురం, నిన్నే పెళ్ళడతా, మురారి లాంటి క్లాసిక్స్ అందించిన కృష్ణవంశీ ఆ తరువాత డీలాపడ్డారు.

వరుస ఫ్లాపులతో కష్టాల్లో కూరుకుపోయిన కృష్ణవంశీకి కాస్త ఊరటనిచ్చిన చిత్రం చందమామ.ఇక ఫామ్ లోకి వచ్చారు అనుకున్న తరుణంలో మళ్ళి పాత కథే రిపీట్ అయ్యింది.

Anushka To Replace Tamannah In Krishna Vamsi Next -Latest News English-Telugu Tollywood Photo Image

కృష్ణవంశి ని మళ్ళి ఫ్లాపులు పలకరించాయి.

గత ఏడాది వచ్చిన గోవిందుడు అందరివాడేలే మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అది కుడా చిన్న హిట్ గా నిలిచి నష్టాల్ని మిగుల్చుకుంది.

ఇక ఈసారి కొత్త జోనర్ తో సినిమా మొదలుపెట్టబోతున్నారు ఆయన.దెయ్యాల నేపథ్యంలో హర్రర్ మూవీ తీయబోతున్నారు.

కృష్ణవంశి తీయబోయే ఈ కొత్త చిత్రాన్ని దిల్ రాజు, నటుడు ప్రకాశ్ రాజ్ సంయుక్తంగా నిర్మిస్తారట.అయితే కథానాయిక ప్రధానంగా సాగే ఈ చిత్రానికి మొదట తమన్నా పేరుని పరిశీలించారట.

ఆ తరువాత అనుష్క అయితేనే పాత్రకు తగ్గట్టుగా సరిపోతుందని భావించి ప్రస్తుతం అనుష్క కథ చర్చలు జరుపుతున్నరాని టాక్.ఈ విషయం తమన్నకి తెలిస్తే ఎలా ఫీల్ అవుద్దో !

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka To Replace Tamannah In Krishna Vamsi Next ?- Related....