నాని కోసం వి ఈవెంట్ లో సందడి చేసిన స్వీటీ అనుష్క

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క మీద ఈ మధ్య ఎక్కువగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి దశాబ్దం దాటిపోవడంతో, నటిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన స్టార్ హీరోలకి సరిపోయే బాడీ లాంగ్వేజ్ లేకపోవడంతో అనుష్కని ఇండస్ట్రీ నుంచి బయటకి సాగనంపేందుకు పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

 Anushka Special Appearance For Nani V Movie Event-TeluguStop.com

అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె పదేపది సార్లు క్లారిటీ ఇస్తుంది.అయితే మొన్నటి వరకు నిశ్శబ్దం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ అమ్మడు సినిమా ఈవెంట్స్ లో పెద్దగా కనిపించలేదు.

సినిమాకి ముందు ఆస్ట్రేలియా వెళ్లి బరువు తగ్గించుకుంది అని వార్తలు వచ్చాయి.ఈ నేపధ్యంలో అనుష్క బయట ఎలా ఉందో చూడాలని చాలా మంది భావించారు.

చాలా గ్యాప్ తర్వాత మొదటి సారి నాని నిర్మాతగా తెరకెక్కుతున్న హిట్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనుష్క సందడి చేసింది.ఈ ఈవెంట్ తో అనుష్క స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి.

అయితే ఆమె లుక్ చూసిన వారు మాత్రం కాస్తా ఆశ్చర్యానికి గురి కావడం విశేషం.సైజ్ జీరో కోసం లావైన అనుష్కకి ఆ సినిమా ఓ పీడకల అయిన ఆ లావు మాత్రం ఇప్పటికి ఆమె మీద ప్రభావం చూపిస్తునే ఉంది.

ఆమె ఏ మాత్రం లావు తగ్గలేదు.పొడవుగా ఉండటం వలన పెద్దగా కనిపించడం లేదు.స్టార్ యాంకర్ అనసూయ లాంటి వారు, అలాగే స్టార్ హీరోయిన్ నయనతార లాంటి వారు ఫిట్ నెస్ మీద దృష్టి పెడితే యోగ ట్రైనర్ అయిన అనుష్క మాత్రం బాడీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం కాస్తా ఆలోచించాల్సిందే.ఇదిలా ఉంటే వి మూవీ ఈవెంట్ కోసం నాని జక్కన్నని కూడా రంగంలోకి దిగాడు.

అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోలు కూడా సందడి చేశారు.మొత్తానికి స్వీటీ ఈ సినిమా ఈవెంట్ లో సందడిచేసిన ఫ్యాన్స్ ని ఉత్సాహ పరిచిన కూడా ఆమె ఆహార్యం చూసిన వాళ్ళు మాత్రం షాక్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube