వరంగల్ లో భారీగా ప్లాన్ చేసిన అనుష్క శెట్టి పుట్టినరోజు వేడుకలు..!  

Anushka Shetty\'s, birthday, celebrations, Warangal , social media, one week birthday celebrations, nov1-nov 7 - Telugu Anushka Shetty\\'s, Anushka Shettys Birthday Celebrations Planned In Warangal, Birthday, Celebrations, Nov1-nov 7, One Week Birthday Celebrations, Social Media, Warangal

టాలీవుడ్ సినీ పరిశ్రమలో సూపర్ సినిమాతో పరిచయమైన హీరోయిన్ అనుష్క శెట్టి.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క ఆ తర్వాత కొద్దికాలంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

TeluguStop.com - Anushka Shettys Birthday Celebrations Planned In Warangal

ఈమె సినిమా కెరియర్ లో మొదట్లో కాస్త గ్లామర్ రోల్స్ ఎక్కువ చేసినప్పటికీ ఆ తర్వాత గ్లామర్ షో తగ్గించి నెమ్మది నెమ్మదిగా పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఇదే క్రమంలో దర్శకుడు కోడి రామకృష్ణ, మల్లెమాల చిత్ర నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినిమా కెరీర్ ని ఓ స్థాయికి చేర్చింది.

ఆ సినిమాతో అనుష్క అంటే ఈవిడ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది.ఎప్పుడైతే అరుంధతి సినిమా వచ్చిందో అప్పటి నుంచి ఆవిడకు గ్లామర్ రోల్స్ తగ్గించేసి పూర్తిగా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటింపజేయడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు.

TeluguStop.com - వరంగల్ లో భారీగా ప్లాన్ చేసిన అనుష్క శెట్టి పుట్టినరోజు వేడుకలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ సినిమాతో హీరోలతో పోటీగా ఆమె ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.ఇక ఆ తర్వాత చాలా సినిమాల తర్వాత భారీ హిట్ బాహుబలి సినిమా ద్వారా లభించింది.

బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో ఆవిడ ఒదిగిపోయింది.ఇక ఇది ఇలా ఉంటే అసలు విషయంలోకి వెళితే…

రాబోయే నవంబర్ 7వ తేదీన అనుష్క శెట్టి 38 వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.

ఇందుకోసం అనుష్క శెట్టి వీరాభిమానులు ఆవిడ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున చేయాలని భారీ ప్లాన్ చేస్తున్నారు.హీరోల పుట్టినరోజులే ఒకటి లేదా మహా అయితే రెండో రోజు చేసి వదిలేసే ఈ కాలంలో హీరోయిన్ అనుష్క పుట్టిన రోజును ఏకంగా ఏడు రోజుల పాటు చేస్తున్నారంటే ఆవిడ కు ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది.

హీరోయిన్ అనుష్క పుట్టినరోజు వారం రోజుల పాటు వారోత్సవాల వలె నిర్వహించబోతున్నారు ఆవిడ అభిమానులు.తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా అనుష్క ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇందుకు సంబంధించి అనుష్క ఫ్యాన్స్ నవంబర్ ఒకటో తారీకు నుండి నవంబర్ ఏడో తారీఖు వరకు ఆమె పుట్టిన రోజు వేడుకలను రోజుకు ఒక కార్యక్రమం చొప్పున ఏడు రోజులపాటు వేడుకలను జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి ఏఏ రోజు ఏఏ పనులు చేయబోతున్నారో వాటికి సంబంధించిన ప్లాన్ కూడా చేసి వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారింది.తాజాగా అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాతో ఓ లేడి ఓరియెంటెడ్ సినిమా తీసిన అది కాస్త అభిమానులను నిరాశ పరిచిందని చెప్పవచ్చు.

ఇకపోతే తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ప్రకటించిన శాకుంతలం సినిమాలో అనుష్క నటించే అవకాశం ఉంది.

#Warangal #AnushkaShettys #Celebrations #OneWeek #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Shettys Birthday Celebrations Planned In Warangal Related Telugu News,Photos/Pics,Images..