ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టిన అనుష్క.. అవాక్కైన నెటిజన్లు!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోహీరోయిన్ల గురించి గాసిప్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి.ఆయా హీరోహీరోయిన్లు ఎన్నిసార్లు స్పందించి వివరణ ఇచ్చినా గాసిప్స్ మాత్రం ఆగవు.

 Anushka Shetty Tweet Goes Viral In Social Media, Anushka Shetty , Prabhas, Prabh-TeluguStop.com

అలా ఇండస్ట్రీలో ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయిన జంటల్లో ప్రభాస్ అనుష్క జంట కూడా ఒకటి.బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాల్లో ప్రభాస్, అనుష్క కలిసి నటించారు.

వీళ్లిద్దరూ జంటగా నటించిన నాలుగు సినిమాలు హిట్లు కావడం గమనార్హం.అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం వల్లే వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి.

తాజాగా అనుష్క ప్రభాస్ తో ప్రేమ, పెళ్లి వార్తల గురించి స్పందిస్తూ ప్రభాస్ కూ తనకూ మధ్య బాహుబలి దేవసేన బంధాన్ని ఊహించుకోవద్దంటూ వ్యాఖ్యలు చేసింది.నిన్న ప్రభాస్ పుట్టినరోజు కాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను అనుష్క రివీల్ చేసింది.

ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ “హ్యాపీ బర్త్ డే పుప్సూ” అని మెసేజ్ చేసి ప్రభాస్ నిక్ నేమ్ ను బయటపెట్టింది.ఈ ట్వీట్ తో అనుష్క ప్రభాస్ ను ఏమని పిలుస్తుందో అర్థమైంది.

ప్రభాస్ కు విషెస్ చెప్పడంతో పాటు అనుష్క రాధే శ్యామ్ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.అనుష్క చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మరోవైపు ఈ నెల 2వ తేదీన అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.

ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా లక్షల సంఖ్యలో అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లు ఈ సినిమాను వీక్షించారని.

ఈ సినిమా ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube