ప్రవీణ్ సత్తారు సినిమాలో నాగార్జునతో జత కట్టబోతున్న అనుష్క

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ హిట్ మూవీ రేస్ ఆధారంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

 Anushka Shetty To Pair Up With Nagarjuna In Next Film-TeluguStop.com

ఇక ఈ సినిమాని కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

మరో వైపు క్యాస్టింగ్ సెలక్షన్ కూడా దర్శకుడు చేస్తున్నట్లు తెలుస్తుంది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భాగానే ఉన్నాయి.

 Anushka Shetty To Pair Up With Nagarjuna In Next Film-ప్రవీణ్ సత్తారు సినిమాలో నాగార్జునతో జత కట్టబోతున్న అనుష్క-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో ఆమె ఎంపిక కన్ఫర్మ్ అయ్యిన్తే నాగార్జునతో అనుష్క కలిసి నటించిన పదో సినిమా ఇది అవుతుంది.

ఈ గత రెండు దశాబ్దాల కాలంలో ఒకే హీరోయిన్ ని ఎక్కువ సినిమాలలో రొమాన్స్ చేసిన హీరోగా నాగార్జున నిలిచిపోతాడు.ముప్పై ఏళ్ల క్రితం హీరోయిన్, హీరోల కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉండేవి.

అయితే తరువాత హీరోయిన్స్ సంఖ్య గణనీయంగా పెరగడంతో కాంపిటేషన్ ఎక్కువై హీరోలు ఒక హీరోయిన్ తో రెండు, మూడు సార్లుకి మించి జత కట్టడం లేదు.హీరోయిన్స్ కూడా వేగంగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉండటం దీనికి ఒక కారణం చెప్పాలి.

అయితే స్వీటీ అనుష్కని టాలీవుడ్ లో సూపర్ సినిమాతో నాగార్జున హీరోయిన్ గా పరిచయం చేశాడు.తరువాత ఆమెకి తన సినిమాలలో అవకాశాలు ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగడంలో నాగార్జున కీలక పాత్ర పోషించారని చెప్పాలి.

ఇప్పుడు అనుష్క కెరియర్ ముగించే దశలో ఉంది.అయినా కూడా ఈ కొత్త సినిమా కోసం నాగార్జున అనుష్కని లీడ్ కోసం రిఫర్ చేసి ఫిక్స్ చేయించినట్లు టాక్ వినిపిస్తుంది.

#Akkineni Fans #Race Remake #Anushka Shetty #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు