రౌడీ స్టార్, అనుష్క కాంబినేషన్ లో కొత్త సినిమా

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ అనుష్క శెట్టి.ఈ అమ్మడు స్టార్ హీరోలు అందరితో జత తెలుగు, తమిళ బాషలలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.

 Anushka Shetty To Act With Vijay Devarakonda, Tollywood, Telugu Cinema, Crazy Co-TeluguStop.com

బాహుబలి సినిమాతో అనుష్క పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా అనుష్క ఉంది.

ఇదిలా ఉంటే అనుష్క తాజాగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటం, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే నిశ్శబ్దం అంచనాలని అందుకోలేక ఓ ఎవరేజ్ మూవీగా మిగిలిపోయింది.ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.

ఇదిలా ఉంటే నిశ్శబ్దం తర్వాత అనుష్క ఓ మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.ఇప్పుడు మరో సినిమాకి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.విజయ్‌ దేవరకొండ, అనుష్క కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త వినిపిస్తోంది.

కొత్త దర్శకుడు వీరిద్దరిని తన కథతో ఇంప్రెస్ చేసాడని, అనుష్క కూడా కథ విని వెంటనే ఒకే చెప్పేసింది అని తెలుస్తుంది.విజయ్ దేవరకొండ కూడా చాలా ఎక్సైటింగ్ అయ్యి చేయడానికి ఒకే చెప్పాడని సమాచారం.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube