ఆరోజు కుండ బద్దలుకొట్టనున్న అనుష్క!

అనుష్క.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Actress Anushka Shetty Reveals Film News About Her  Anushka Shetty, Nishabdam Fi-TeluguStop.com

ఎన్నో ఏళ్లుగా సినీమా హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్కకు ఇప్పటికి స్టార్ డమ్ తగ్గలేదు.అనుష్క సినిమా అంటే చాలు స్టార్ హీరో సినిమా అన్నట్టు అభిమానులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు.

ఇక అలానే ఇటీవలే అనుష్క సినిమా నిశ్శబ్దం విడుదలైంది.

ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇటీవల ఓటిటిలో విడుదల అయ్యింది.

అయితే అభిమానులు ఊహించినంత లేకపోయినప్పటికీ విడుదల అవ్వడానికి ఏ సినిమాలు లేకపోవడంతో నిశ్శబ్దం ఓ రకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే అనుష్క శెట్టి ఒక్క నిశ్శబ్దం సినిమా తప్ప మరే సినిమాలో చేస్తున్నట్టు అప్డేట్స్ లేవు.

నిశ్శబ్దం విడుదలయ్యాక అనుష్క మిగితా ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తుందా? అని చూసినప్పటికీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఎలాంటి అప్డేట్ లేదు.అసలు ముందు ముందు సినిమాలు తీస్తుందా లేదా అనే అనుమానంలో అనుష్క అభిమానులు ఉన్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు సినిమాలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వని అనుష్క వచ్చే నెల ఇస్తుందని కొన్ని పుకార్లు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయ్. నవంబర్ 7వ తేదిన అనుష్క పుట్టినరోజు అని.ఆ సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ప్రకటించనున్నట్టు సమాచారం.మరి అనుష్క పుట్టిన రోజు నాడు కొత్త ప్రాజెక్ట్స్ కి సంబంధించి ప్రకటిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది! కాగా గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా, గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా, సూర్య – దర్శకుడు హరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube