అందుకే అనుష్క మహానటి చిత్రంలో నటించలేదట...

తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “సూపర్” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన స్వీటీ “అనుష్క శెట్టి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే అనుష్క శెట్టి సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో 10 లక్షల రూపాయలు పారితోషకం తీసుకునేది.

 Anushka Shetty Rejected Mahanati Movie For That Reason-TeluguStop.com

కానీ క్రమక్రమంగా ఈ అమ్మడికి టాలీవుడ్ లో మార్కెట్ పెరగడంతో దాదాపుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ప్రస్తుతం పారితోషకం తీసుకుంటోంది.ఈ క్రమంలో దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

అంతేకాకుండా టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవితో తప్ప సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపుగా అందరి హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.ఈ క్రమంలో అరుంధతి, భాగమతి, పంచాక్షరి, బాహుబలి, తదితర చిత్రాలలో తన నటనా ప్రతిభను కనబరిచి మొత్తం చిత్రాలకే హైలెట్ గా నిలిచింది.

 Anushka Shetty Rejected Mahanati Movie For That Reason-అందుకే అనుష్క మహానటి చిత్రంలో నటించలేదట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా నటి అనుష్క శెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే 2018వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “నాగ్ అశ్విన్” దర్శకత్వం వహించిన “మహానటి” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో మొదట నటి సావిత్రి పాత్ర కోసం దర్శకుడు “నాగ్ అశ్విన్ అనుష్క శెట్టి” ని సంప్రదించాడట.కానీ అప్పటికే అనుష్క శెట్టి “భాగమతి” చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉండటంతో సినిమా డేట్లు కుదరలేదట.

దీంతో ఈ అవకాశం కీర్తి సురేష్ ని వరించిందని కొందరు చర్చించుకుంటున్నారు.ఏదేమైనప్పటికీ కీర్తి సురేష్ కు మాత్రం మహానటి చిత్రం తన సినీ జీవితంలోనే మైలు రాయిగా నిలిచిపోయింది.

అంతేకాకుండా సావిత్రి మాదిరిగా హావభావాలు పలికించడం అలాగే పలు ఎమోషనల్ సన్నివేశాలలో జీవించి నటించడం వంటి వాటి కారణంగా మంచి హిట్ అవ్వడమే కాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అనుష్క శెట్టి తెలుగులో “నిశ్శబ్దం” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.కానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో అనుష్క శెట్టి తన తదుపరి చిత్రం విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

#Mahanati #Keerthi Suresh #Anushka Shetty #Mahanati #AnushkaShetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు