అనుష్క అందుకే ఆ సీనియర్ హీరోతో నటించలేదట...

టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బ్యూటీఫుల్ హీరోయిన్ “స్వీటీ అనుష్క” గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.ఈ అమ్మడు అప్పట్లో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “సూపర్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.

 Anushka Shetty Reject Rajinikanth Kochadaiiyaan Movie Offer, Rajinikanth, Kocha-TeluguStop.com

ఆ తర్వాత వరుసగా పలువురు స్టార్ హీరోల సరసన నటించి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.కాగా నటి అనుష్క ఆ మధ్య బాహుబలి, భాగమతి తదితర హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కాగా తాజాగా నటి అనుష్క కి సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో సౌత్ సూపర్ స్టార్ “రజనీ కాంత్” హీరోగా నటించిన “కొచ్చడయాన్” చిత్రంలో మొదటగా హీరోయిన్ గా అనుష్క శెట్టి కి అవకాశం వచ్చిందట.

కానీ అనుష్క శెట్టి పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే లేక పోయిందట.దీంతో ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే వరించింది.

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ సభ్యులు దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ వెచ్చించినప్పటికీ కనీసం వంద కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేక పోయింది.

ఆ తర్వాత అనుష్క రజనీకాంత్ తో కలిసి “లింగ” చిత్రంలో నటించింది.ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది.

Telugu Anushka Shetty, Anushkashetty, Kochadaiiyaan, Rajinikanth, Tamil, Tollywo

అయితే ఈ విషయం ఇలా ఉండగా అనుష్క శెట్టి “నిశ్శబ్దం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఈ అమ్మడు తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.కాగా ఆ మధ్య జాతి రత్నాలు మూవీ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నప్పటికీ అనుష్క మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube