డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన స్వీటీ అనుష్క

స్వీటీ శెట్టి అనుష్క టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికగా ప్రస్తుతం కొనసాగుతుంది.బాహుబలి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

 Anushka Shetty Ready To Entry In Digital Platform-TeluguStop.com

అయితే ఆ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాల కోసం అనుష్కని ఇక తీసుకునే పరిస్థితి లేదు.ఫిమేల్ సెంట్రిక్ కథలు మాత్రం అనుష్కకి చేసుకునే ఛాన్స్ ఉంది.

అయితే ఆమె ఫిమేల్ సెంట్రిక్ కథతో గతంలో సైజ్ జీరో సినిమా చేస్తే అది డిజాస్టర్ అయ్యింది.బాహుబలి తర్వాత ఇండియన్ హాలీవుడ్ మూవీగా నిశ్శబ్దం మూవీ చేసింది.

 Anushka Shetty Ready To Entry In Digital Platform-డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిన స్వీటీ అనుష్క-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై ముందు నుంచి భారీ హైప్ ఇచ్చారు.అయితే కరోనా అవాంతరాలతో నిశ్శబ్దం మూవీ ఒటీటీలో రిలీజ్ అయ్యింది.

అనుష్క కెరియర్ లో మరో భారీ డిజాస్టర్ గా ఈ మూవీ మిగిలిపోయింది.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి హైప్ ఇచ్చినంత సీన్ లేదని ప్రేక్షకులు తిరస్కరించారు.

దీని తర్వాత కొద్దిగా సైలెంట్ అయ్యి రారా క్రిష్నయ్య ఫేం మహేష్ దర్శకత్వంలో ఫిమేల్ సెంట్రిక్ మూవీనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యూవీ క్రియేషన్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది.

ఇందులో అనుష్కకి జోడీగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ జరిగిపోయింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుంది.ఇదిలా ఉంటే అనుష్క త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనని, బెంగుళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

వీటిపై ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ బాటలో ఇప్పుడు అనుష్క కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.

రీసెంట్ గా ఓ టాప్ డైరెక్టర్ థ్రిల్లర్ జోనర్ లో వెబ్ సిరీస్ కి సంబంధించి ఇంటరెస్టింగ్ స్టొరీ లైన్ అనుష్కకి చెప్పడంతో ఆమె ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.ప్రముఖ ఒటీటీ చానల్స్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తుందని సమాచారం.

#Director Mahesh #Web Series #UV Creations #Anushka Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు