నిశ్శబ్దంపై నెగిటివ్ కామెంట్స్ ని లైట్ తీసుకున్న అనుష్క

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క తన సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.లేడీ సూపర్ స్టార్ గా, సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్న అనుష్క ఎప్పుడూ కూడా అనవసరమైన ఆర్భాటాలు చూపించడం.

 Anushka Shetty React On Nishabdham Movie Negative Talk, Tollywood, Telugu Cinema-TeluguStop.com

సినిమాలలో వేసినట్లు ఈవెంట్స్ లో కురచ దుస్తులు వేయడం చేయదు.తనకి కంఫర్ట్ ఉండే కాస్ట్యూమ్స్ మాత్రమే బయట ఎప్పుడు కూడా వేసుకుంటుంది.

అలాగే చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేస్తుంది.ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వంతో, అందరిని చిరునవ్వుతో పలకరించడం అనుష్క నైజం.

అలాగే మీడియాకు వీలైనంత దూరంగా ఉంటుంది, ఇంటర్వ్యూలపై పెద్దగా ఆసక్తి చూపించదు.కేవలం సినిమా ఈవెంట్స్ వరకు మాత్రమే బయటకి వచ్చి మాట్లాడుతుంది.

ఫోటోషూట్ లకి కూడా చాలా దూరంగా ఉంటుంది.

స్టార్ హీరోయిన్స్ గా ఉన్నవాళ్లు చాలా మంది మోడరన్ గా కనిపించడానికి ఇష్టపడతారు.

అయితే అనుష్క మాత్రం వీరందరికంటే ప్రత్యేకం అని చెప్పాలి.ఇండస్ట్రీలో అందరితో కూడా మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంది.

అసలు ఆమె ఎవరి మీద కూడా ఎప్పుడూ కూడా కోపాన్ని ప్రదర్శించడం చూడలేదు.ఇదిలా ఉంటే సినిమా విషయంలో కూడా ఆమె ఆలోచన చాలా సింపుల్ గా ఉంటుందని తాజాగా ఒక సంఘటన రుజువు చేసింది.

ఎంతో కష్టపడి చేసిన నిశ్శబ్దం మూవీ రిలీజ్ అయినా తర్వాత డివైడ్ టాక్ తెచ్చుకుంది.అయితే డివైడ్ టాక్ తెచ్చుకుందని ఆమె కృంగిపోకుండా ఆ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంది.

ట్విట్టర్ లో ఓ అభిమాని ఆమెని టాగ్ చేసి మీ నిశ్శబ్దం సినిమా నాకు అస్సలు నచ్చలేదు.దానికి లాజిక్ లేదని కామెంట్ చేశాడు.

దీనిపై అనుష్క చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.ధన్యవాదాలు, ఇకపై మీ అభిప్రాయాలని పరిగణంలోకి తీసుకుంటాం అని రిప్లై ఇచ్చింది.

ఈ ఒక్క రిప్లై ఆమె ఆలోచన ఎలాంటిదో చెబుతుందని సోషల్ మీడియాలో అనుష్కపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube