ఆర్ఆర్ఆర్ కోసం అనుష్కని రంగంలోకి దించుతున్న జక్కన్న  

ఆర్ఆర్ఆర్ లో క్యామియో రోల్ చేస్తున్న అనుష్క.

Anushka Shetty Plays Special Role In Rrr Movie-jr Ntr,rajamouli,ram Charan,rrr Movie

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాలలో సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకునే దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాల తర్వాత స్టార్ దర్శకుడు రాజమౌళి మరోసారి భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేసాడు అనే సంగతి అందరికి తెలిసిందే...

ఆర్ఆర్ఆర్ కోసం అనుష్కని రంగంలోకి దించుతున్న జక్కన్న-Anushka Shetty Plays Special Role In RRR Movie

తారక్, రామ్ చరణ్ హీరోలు భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇక సముద్రఖని, నిత్యా మీనన్ లాంటి సౌత్ స్టార్స్ కూడా కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.ఇదిలా ఉంటే సెల్యులాయిడ్ మీద గ్రాండ్ గా ఆర్ఆర్ఆర్ ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్న రాజమౌళి సినిమాలో క్యామియో రోల్ కోసం తన దేవసేనని రంగంలోకి దించినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే రాజమౌళి అనుష్కతో తన పాత్ర గురించి చెప్పడం. ఆమె కూడా ఒప్పుకోవడం జరిగిందని సమాచారం. రాజమౌళి అభ్యర్ధన మేరకు ఈ క్యామియో చేయడానికి స్వీటీ సిద్ధం అయినట్లు తెలుస్తుంది.

ఇక దీంతో పాటు సైరాలో కూడా ఓ ప్రత్యేక గీతంలో అనుష్క కనిపించబోతున్నట్లు సమాచారం.