మనసుకి నచ్చిన సినిమాలే చేస్తా అంటున్న అనుష్క  

Anushka Open Up Her Cinema Selection, Tollywood, Telugu Cinema, South Heroines, Star Heroine, Anushka Shetty - Telugu @msanushkashetty, Anushka Open Up Her Cinema Selection, Anushka Shetty, South Heroines, Star Heroine, Telugu Cinema, Tollywood

హీరోయిన్స్ గా కెరియర్ ప్రారంభించే అందాల భామలు మంచి అవకాశాలు, క్రేజ్ రాగానే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ పెంచేస్తారు.వరుసగా రెండు హిట్స్ వచ్చి డిమాండ్ పెరిగితే ఆ డిమాండ్ కి తగ్గట్లు వాళ్ళ రెమ్యునరేషన్ కూడా ఉంటుంది.

TeluguStop.com - Anushka Shetty Open Up Her Cinema Selection

అయితే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లు రెమ్యునరేషన్ తక్కువే అయిన కమర్షియల్ సినిమాలకి వచ్చేసరికి వారి పాత్రలకి ఉన్న స్కోప్ చాలా తక్కువ.అలాగే బిజినెస్ పరంగా కూడా హీరోయిన్లు ఇమేజ్ ఎంత మాత్రం సౌత్ లో ఉపయోగపడదు.

ఇదిలా ఉంటే సౌత్ లో సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ స్వీటీ అనుష్క.ఈ భామ కెరియర్ ఆరంభం నుంచి వరుస అవకాశాలతో తనని తాను నటిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉంది.

TeluguStop.com - మనసుకి నచ్చిన సినిమాలే చేస్తా అంటున్న అనుష్క-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే సినిమాల ఎంపికలో తన ఆలోచన ఎప్పుడూ నటిగా నాకు ఎంత వరకు హెల్ప్ అవుతుంది.ఆయా సినిమాలో నేను చేస్తున్న పాత్రలు నాకు ఎంత సంతృప్తి ఇచ్చాయనే విషయాన్ని మాత్రమే చూస్తానని అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

సినిమాను వ్యాపారధృక్కోణంతో తాను ఎన్నడూ చూడనని, ఆన్‌స్క్రీన్‌ మ్యాజిక్‌ను, సంతోషాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడానికే ప్రయత్నిస్తానని అంటోంది.చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 15 ఏళ్ల కెరియర్ ని అనుష్క పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా తన కెరియర్ గురించి, సినిమాల ఎంపిక గురించి మనసు విప్పి మాట్లాడింది .ఈ ప్రయాణంలో ప్లాన్‌ చేస్తూ తానెప్పుడూ సినిమాలు చేయలేదని తెలిపింది.మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగానని తెలిపింది.నాకు లెక్కలు తెలియవు.నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది.పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందా లేదా అనేవి పట్టించుకోను.

నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను.అంతకుమించి ఏదీ కోరుకోను అని స్పష్టం చేసింది.

#South Heroines #Star Heroine #AnushkaOpen #Anushka Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Shetty Open Up Her Cinema Selection Related Telugu News,Photos/Pics,Images..