అనుష్క నిశ్శబ్దం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్  

Anushka Shetty Nishabdham Has A Release Date-hollywood,madhavan,nishabdham,release Date,tollywood

బాగమతి సినిమా తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం.అమెరికన్ బ్యాక్ డ్రాప్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనుష్క మూగమ్మాయిగా కనిపిస్తుంది.ఇప్పటికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతుంది.

Anushka Shetty Nishabdham Has A Release Date-hollywood,madhavan,nishabdham,release Date,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News-Anushka Shetty Nishabdham Has A Release Date-Hollywood Madhavan Nishabdham Release Date Tollywood

ఇందులో హాలీవుడ్ స్టార్ నటుడు మైఖేల్ మ్యాడిసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక మాధవన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కుతుంది.ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని జనవరి 31న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.పీపుల్స్ మీడియాతో పాటు కోన ఫిల్మ్ ఫ్యాక్టరి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.మరి ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు మెస్మరైజ్ చేస్తుంది అనేది తెలియాలంటే జనవరి ఆఖరు వరకు వేచి చూడాల్సిందే.