అరే... అనుష్క మరీ ఇంత తక్కువ ఎందుకు చెప్పింది, ఆమెలో నమ్మకం సన్నగిల్లుతోందా?     2019-01-10   12:16:56  IST  Ramesh Palla

‘బాహుబలి’ చిత్రం తర్వాత సౌత్‌లోనే కాదు, ఏకంగా ఇండియా మొత్తం అనుష్క సందడి కనిపించనుంది, బాలీవుడ్‌లో అనుష్క దుమ్ము రేపి, అక్కడున్న స్టార్‌ హీరోయిన్స్‌ను సైడ్‌ చేయడం ఖాం అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా బాహుబలి తర్వాత అనుష్క చాలా సైలెంట్‌ అయ్యింది.

Anushka Shetty New Look And Remuneration For Her Next-Anushka Next Viral About

Anushka Shetty New Look And Remuneration For Her Next

ఆమె బాహుబలి తర్వాత సైజ్‌ జీరో మరియు భాగమతి చిత్రాల్లో తప్ప మరే సినిమాలో కనిపించలేదు. కారణం ఆమె బరువు. అవును ఆమె చాలా బరువు పెరగడం వల్ల సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. బరువు తగ్గేందుకు దాదాపు సంవత్సరం ప్రయత్నించిన అనుష్క ఎట్టకేలకు సినిమాకు కమిట్‌ అయ్యింది.

తెలుగులో అనుష్క ఒక హర్రర్‌ నేపథ్యంలోని హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేయబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే ఆ సినిమాకు అనుష్క తీసుకోబోతున్న పారితోషికం కేవలం 1.25 కోట్లు. ఈమద్య కాలంలో తెలుగు స్టార్‌ హీరోయిన్స్‌ కోటిన్నరకు తగ్గకుండా తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకైతే ఏకంగా రెండున్నర కోట్లు తీసుకుంటున్నారు. కాని అనుష్క మాత్రం మరీ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తనకు 1.25 కోట్లు చాలంటూ అనుష్క స్వయంగా నిర్మాతతో చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

అనుష్క సినిమాలకు చాలా గ్యాప్‌ వచ్చింది. ఆ గ్యాప్‌ కారణంగానే తాను చేసే సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారో లేదో అనే అనుమానం ఆమెలో ఉంది. అందుకే ఆమె ఇలా తక్కువ పారితోషికం తీసుకుని ఈ చిత్రం చేయాలని భావిస్తుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్నారు. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను దక్కించుకుంటే అప్పుడు అనుష్క తన రేంజ్‌లో వసూళ్లు చేస్తుందేమో చూడాలి.

Anushka Shetty New Look And Remuneration For Her Next-Anushka Next Viral About