2018లోనే అనుష్క పెళ్లి.. ఇదే సాక్ష్యం, మరి ప్రభాస్‌?       2018-06-12   03:02:07  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులు ముద్దుగా జేజమ్మ అంటూ పిలుచుకునే అనుష్క ఈమద్య వెండి తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు సినిమా చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే అనుష్క పెళ్లి గురించి కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత బాలీవుడ్‌ అవకాశాలను సైతం దక్కించుకుంటుందని భావించిన అనుష్కకు సౌత్‌లోనే సినిమాల ఆఫర్లు కష్టం అయ్యాయి. ఆమె బాగా లావు అవ్వడంతో పాటు ఆమె తాజా చిత్రం భాగమతి ఆశించిన ఫలితాన్ని అందించడంలో విఫలం అయ్యింది. దాంతో సినిమాల్లో ఈమెకు ఆఫర్లు తగ్గాయి.

లావు తగ్గడంతో పాటు, కాస్త గ్యాప్‌ తీసుకోవాలని భావించిన అనుష్క సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నా కూడా వద్దని అంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు గోపీచంద్‌ సరసన ఒక చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. తమిళంలో కూడా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ఈమె చేయబోతుంది. ఈ రెండు సినిమాు మినహా ఈమె మరే సినిమాలను చేయడం లేదు. ఇక గత కొంత కాలంగా అనుష్క ప్రభాస్‌లు ప్రేమలో ఉన్నారు అని, ఇద్దరు కూడా వారి వారి పుట్టిన రోజులకు ప్రత్యేకమైన బహుమానాలు ఇవ్వడంతో పాటు, ఇద్దరి మద్య సన్నిహిత్యం చాలా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ మద్య ఒక జాతీయ మీడియాకు సంబంధించిన వ్యక్తి త్వరలోనే ప్రభాస్‌, అనుష్కలు వివాహం చేసుకుంటారు అంటూ ప్రకటించాడు.

ఆ వ్యాఖ్యలను ఆ సమయంలో ఇద్దరు కొట్టి పారేసినా కూడా ఆ తర్వాత ఇద్దరు మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉన్నారు. తాజాగా కూడా ఒక కార్యక్రమంలో హాజరు అయ్యేందుకు దుబాయి వెళ్లిన అనుష్క అక్కడే ‘సాహో’ చిత్రీకరణలో ఉన్న ప్రభాస్‌ను కలవడం జరిగింది. మొత్తానికి ప్రభాస్‌తో ఈ అమ్మడి వివాహం అనుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులు అనుష్కకు పెళ్లి ఫిక్స్‌ అయ్యింది అంటూ ప్రకటించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించడంతో పాటు, ఈ సంవత్సరంలోనే అనుష్క వివాహంను చేయబోతున్నట్లుగా ఆమె కుటుంబ సభ్యులు అనధికారికంగా చెబుతూ ఉన్నారు.

కన్నడ మీడియాలో వచ్చిన ఒక వార్తను బట్టి చూస్తే ఒక వ్యాపారవేత్తతో అనుష్కకు వివాహం ఫిక్స్‌ అయ్యింది. బెంగళూరుకు చెందిన ఆయన గత కొంత కాలంగా అనుష్కతో సన్నిహితంగా ఉంటున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహంను చేసుకుంటాను అంటూ అనుష్క పదే పదే చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ ఆమె స్నేహితులు చెబుతున్నారు. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరగడం ఏంటీ అంటూ రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రభాస్‌, అనుష్కల కాంబినేషన్‌ చాలా బాగుంటుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.