నటి అనుష్క శెట్టి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో తెలుగు వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ సినిమా కొంత నిరాశపరిచిందే.
ఆ సినిమా నిరాశపరిచినా నటిగా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇక వరుస బెట్టి స్టార్ హీరోలతో నటిస్తూ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనా ప్రాధాన్యత గల పాత్రలను పోషిస్తూ తన కంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంది.అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ గా నిలిచింది.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అనుష్క పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అనుష్క శెట్టి నా క్రష్ అని, బాహుబలిలో తన నటనకు ఫిదా అయ్యానని, తనతో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టాడు రణబీర్ కపూర్.
ఇక రణబీర్ కామెంట్స్ బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి.ఇక రణబీర్ తో సినిమా ఫిక్స్ అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే బాలీవుడ్ లో అనుష్క హవా మొదలవుతుందని అనుష్క ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.