అయ్యప్ప భక్తి పారవశ్యంలో ముగిని తేలనున్న అనుష్క... ఈసారి వరం దక్కేనా?  

Anushka Shetty In Devotional Film On Lord Ayyappa-ar Rahman,lord Ayyappa Film,santosh Sivan Direction

‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో అనుష్క కృష్ణమ్మ పాత్రలో నటించిన విషయం తెల్సిందే. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అనుష్క పోషించిన పాత్ర కూడా ఫ్లాప్‌ అయ్యింది. అయినా కూడా దైవ భక్తి కారణమో లేక మరేంటో కాని మరోసారి భక్తురాలి పాత్రను పోసించేందుకు అనుష్క గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చింది..

అయ్యప్ప భక్తి పారవశ్యంలో ముగిని తేలనున్న అనుష్క... ఈసారి వరం దక్కేనా?-Anushka Shetty In Devotional Film On Lord Ayyappa

ప్రస్తుతం ఈమె ఒక తెలుగు సినిమాలో మాధవన్‌ తో కలిసి నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఆ చిత్రం తర్వాత ఒక భారీ భక్తిరస చిత్రాన్ని చేసేందుకు అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దక్షినాది నాలుగు భాషలతో పాటు, హిందీలో కూడా సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్రతో ఒక చిత్రం రూపొందబోతుంది. ఆ చిత్రంలో అనుష్క కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కాని కథ పూర్తిగా అనుష్క చుట్టు తిరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

పెద్ద ఎత్తున సినిమాను తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్దంగా ఉంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రంను నిర్మించి అయ్యప్ప భక్తులకు కానుకగా ఇవ్వాలని మలయాళ పరిశ్రమకు చెందిన ఒక నిర్మాణ సంస్థ భావిస్తోంది.

బాహుబలి చిత్రం తర్వాత ఒక్కసారిగా అనుష్క క్రేజ్‌ పెరిగి పోయంది. అయితే ఆమె లావు అవ్వడంతో వచ్చిన అవకాశాలను వద్దనుకుంది.

సంవత్సరం పాటు ఆమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే లైన్‌లోకి వస్తుంది. ఆమె ఏ స్థాయి నటనతో ఈ రెండు చిత్రాల్లో ఆకట్టుకుంటుందో చూడాలి..

ఈ రెండు చిత్రాల తర్వాత గ్లామర్‌ పాత్రలతో మళ్లీ అనుష్క ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.