ఆ దర్శకుడితో నా పెళ్లి జరగట్లేదంటున్న స్వీటీ...  

anushka shetty gives clarity about his marriage - Telugu Anushka Shetty Gives Clarity,, Anushka Shetty Latest Movoe News, Anushka Shetty Marriage Latest News, Anushka Shetty Marriage News, Anushka Shetty Mvie News

టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ మరియు విలక్షణ నటి అనుష్క శెట్టి అంటే పెద్దగా తెలియని వారుండరు.అనుష్క శెట్టి సినీ పరిశ్రమకి వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు అయింది.

TeluguStop.com - Anushka Shetty Gives Clarity About His Marriage

ఈ కాలంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.అయితే 38 సంవత్సరాలు పైబడినటువంటి ఈ అమ్మడు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడి పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

అంతేగాక ఇప్పటికే అనుష్క శెట్టి భారత్ క్రికెట్ జట్టుకు చెందినటువంటి ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతోందని అతడినే పెళ్లి చేసుకుంటుందని కూడా పలు పుకార్లు వినిపించాయి.

TeluguStop.com - ఆ దర్శకుడితో నా పెళ్లి జరగట్లేదంటున్న స్వీటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ మధ్య కాలంలో అయితే టాలీవుడ్ సినీ పరిశ్రమలో నీ ఓ ఫేమస్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంటుందని కూడా పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో తాజాగా అనుష్క శెట్టి తన పెళ్లిపై వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించింది.ఇందులో భాగంగా తాను టాలీవుడ్ కి చెందినటువంటి దర్శకుడి పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టత ఇచ్చింది.

అంతేగాక పెళ్లి విషయంలో తనకు లేని తొందర మీకెందుకు అంటూ తన పెళ్లి ఈ విషయంలో పుకార్లు పుట్టిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే పెళ్లి అనేది తన జీవితానికి సంబంధించిన విషయమని కచ్చితంగా తాను పెళ్లి చేసుకునే సమయంలో అందరికీ చెప్పి చేసుకుంటానని నిజానిజాలు తెలియకుండా తెలుసుకోకుండా ఇలాంటివి తప్పుడు పుకార్లు పుట్టించొద్దనీ హెచ్చరించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనుష్క శెట్టి “నిశ్శబ్దం” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో అనుష్క మూగ, చెవిటి సంబంధిత వ్యాధితో బాధపడే  యువతి పాత్రలో నటించింది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ ఏప్రిల్ 2వ తారీఖు న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

#AnushkaShetty #AnushkaShetty #AnushkaShetty #AnushkaShetty #AnushkaShetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Shetty Gives Clarity About His Marriage Related Telugu News,Photos/Pics,Images..