హమ్మయ్య ఆ వార్తలు నిజం కావట.. అనుష్క అభిమానులకు గుడ్‌ న్యూస్‌  

Anushka Shetty Fans Happy With Not Doing Sequel Of Arundhati-

గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘అరుంధతి’ సీక్వెల్‌ రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.అరుంధతి 2 సినిమా కోసం ఆర్‌ఎక్స్‌ 100 ముద్దుగుమ్మ యాక్షన్‌ సీన్స్‌కు శిక్షణ తీసుకుంటుందని సినీ వర్గాల్లో చర్చ జరిగింది.కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి చిత్రం టాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.అలాంటి సినిమాను ఇప్పుడు సీక్వెల్‌ చేయడం అంటే అంతా కూడా సంతోషించే విషయమే.

Anushka Shetty Fans Happy With Not Doing Sequel Of Arundhati--Anushka Shetty Fans Happy With Not Doing Sequel Of Arundhati-

కాని అది అనుష్క కాకపోవడంతో అంతా వ్యతిరేకించారు.

Anushka Shetty Fans Happy With Not Doing Sequel Of Arundhati--Anushka Shetty Fans Happy With Not Doing Sequel Of Arundhati-

అనుష్క క్రేజ్‌ను అమాంతం పెంచిన అరుంధతి చిత్రంకు సీక్వెల్‌ చేయనున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతా కూడా అనుష్కనే సీక్వెల్‌ చేయాలని కోరుకున్నారు.కాని అనుష్క కాకుండా పాయల్‌ రాజ్‌ పూత్‌ను ఎంపిక చేశారంటూ వచ్చిన వార్తలు అనుష్క అభిమానులకు మింగుడు పడలేదు.అనుష్క కాకుండా మరే హీరోయిన్‌ చేసినా కూడా అరుంధతి ఆకట్టుకోదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు.

అరుంధతి 2 చిత్రం గురించి మీడియాలో వచ్చిన రకరకాల వార్తల నేపథ్యంలో అసలు విషయంపై క్లారిటీ వచ్చేసింది.అసలు అరుంధతి 2 అనే చిత్రాన్ని ప్లాన్‌ చేయడం లేదని, పాయల్‌ రాజ్‌ పూత్‌ అరుంధతిగా నటించబోతుందన్న వార్తల్లో నిజం లేదని శబ్దాలయ స్టూడియో నుండి అధికారిక ప్రకటన వచ్చింది.అరుంధతి చిత్రంను సీక్వెల్‌ చేసే ఆలోచన ఏమీ లేదని కూడా దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పాడు.దాంతో అనుష్క అభిమానులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.