క్రికెటర్ తో పెళ్లి వార్తలని ఖండించిన స్వీటీ అనుష్క

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అనుష్క.ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ తో సొంతంగా మార్కెట్ పెంచుకున్న అనుష్క త్వరలో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

 Anushka Shetty Cricketer Prabhas Marriage-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అనుష్క పెళ్లి పీటలు ఎక్కబోతుందని, అది కూడా నార్త్ కి చెందిన ప్రముఖ క్రికెటర్ ని ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది.

గతంలో హీరో ప్రభాస్ తో అనుష్క డేటింగ్ లో ఉందని త్వరలో వీరిద్దరు ఒకటవుతారని పుకార్లు వినిపించాయి.వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ గాసిప్ ని ఇద్దరు ఖండించారు.

ఆ వార్తాలో వాస్తవం లేదని తేల్చేసారు.ఇదిలా ఉంటే ఇప్పుడు క్రికెటర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనే వార్త కూడా అలాంటి గాసిప్ అని తెలుస్తుంది.

తాజాగా ఈ వార్తలని అనుష్క ఖండించినట్లు తెలుస్తుంది.తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్న మాట వాస్తవమే అయిన అది క్రికెటర్ తో అనే దానిలో అసలు వాస్తవం లేదని.

ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తారో అర్ధం కాదని చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఇప్పటికే 38 ఏళ్ల వయసుతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అనుష్కకి పెళ్లి కాకుంటే ఇలాంటి పుకార్లు రావడంలో అసలు తప్పు కాదు.

ఆమె పెళ్లి కబురు చెప్పేంత వరకు ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube