నిశ్శబ్దంగా అనుష్క మరో హిట్ కొడుతుందా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల భామ అనుష్క ఇప్పటికే బాహుబలి లాంటి సినిమాలో నటించి తన రేంజ్ పెంచుకొని ఇప్పుడు సోలోగా తనకంటూ మార్కెట్ ఏర్పాటు చేసుకుంది.దీంతో బాహుబలి తర్వాత వచ్చిన బాగుమతి సినిమా ఊహించని విధంగా ఎబ్భై కోట్లు కలెక్ట్ చేసింది.

 Anushka Shetty And Madhavans Nishabdam Title Look Out-TeluguStop.com

సినిమా మొదటి రోజు ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న అనుష్క ఇమేజ్ సినిమా రేంజ్ ని మార్చేసింది.ఇదిలా ఉంటే బాగుమతి సినిమా తర్వాత సుమారు రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఇండో-హాలీవుడ్ మూవీ చేస్తుంది.

మాధవన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే కోనా వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అమెరికాలో మొదలైంది.

సినిమా మొత్తం యూఎస్ నేపధ్యంలో జరుగుతుంది.ఇక ఈ సినిమాలో ఓ హాలీవుడ్ నటుడు కూడా కీలక పాత్ర చేస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.ఇందులో మల్టీ కలర్స్ తో ఉన్న చేతులు 301అనే సింబల్ చూపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ పోస్టర్ అనుష్క ఫాన్స్ తో పాటు, టాలీవుడ్ ప్రేక్షకులలో కూడా ఆసక్తి పెంచింది.పోస్టర్ బట్టి చూస్తూ ఉంటే కంటెంట్ కచ్చితంగా యునిక్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

అనుష్క పాత్ర ఈ సినిమాలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో అనుష్క ఖాతాలో నిశ్శబ్దంతో మరో హిట్ గారంటీ అనే మాట వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube