సైరా కోసం అనుష్క పాత్ర ఏంటో తేలిపోయింది... చిరుతో తమన్నా మరియు స్వీటీ  

Anushka Shetty Act In Saira Narasimha Reddy Movie-

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.ఈ సమయంలోనే ఈ చిత్రంలో ఒక పాత్రను అనుష్క పోషించబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఈ సమయంలో అనుష్క పాత్ర ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా అనుకున్నారు.అయితే ఈ చిత్రంలోని అనుష్క పాత్రపై సినీ వర్గాల ద్వారా క్లారిటీ వచ్చేసింది...

Anushka Shetty Act In Saira Narasimha Reddy Movie--Anushka Shetty Act In Saira Narasimha Reddy Movie-

ఈ చిత్రంలో అనుష్క కనిపించేది నిజమే కాని, ఆమె ఎలాంటి పాత్ర పోషించబోవడం లేదట.

సినిమా చిత్రీకరణలో భాగంగా చివరి పాటను చిత్రీకరించబోతున్నారు.హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్టింగ్‌లో ఆ పాట చిత్రీకరణకు అంతా రంగం సిద్దం చేశారు.

Anushka Shetty Act In Saira Narasimha Reddy Movie--Anushka Shetty Act In Saira Narasimha Reddy Movie-

చిరంజీవితో పాటు తమన్నా ఆ పాటలో స్టెప్పులు వేయబోతున్న విషయం తెల్సిందే.అదే పాటలో ఇప్పుడు అనుష్క కూడా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తుంది.భారీ ఎత్తున అంచనాలున్న సైరా చిత్రం కోసం అనుష్క ఓకే చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

పాటలో కొన్ని షాట్స్‌లో మాత్రమే అనుష్క గెస్ట్‌ అప్పియరెన్స్‌గా కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో కనిపించాలనేది అనుష్క కోరిక అని, అందుకే ఆమె కోరిక మేరకు ఈ చిత్రంలో ఆమెకు ఇలా స్థానం కల్పించినట్లుగా మెగా వర్గాల వారు చెబుతున్నారు.అయితే అనుష్క ఉంటే సినిమా రేంజ్‌ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆమెను తీసుకున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సైరాలో అనుష్క ఉండటం కన్ఫర్మ్‌ అయ్యింది.