తాజాగా జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ ఆఖరి పోరాటంలో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.దీంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భారతీయులు తీవ్ర నిరాశ చెందారు.
ఆఖరి వరకు ఇండియా గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్న క్రికెట్ ప్రియులకు ఊహించని విధంగా నిరాశ ఎదురయింది.దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలకు గండి పడింది.2003 తర్వాత అదే జట్టుతో ఫైనల్ ఫైట్ మళ్లీ ఎదురైంది.అప్పటి ఓటమి లెక్కలు సరిచేసి ఇప్పుడు గెలిచి రివేంజ్ తీర్చుకుంటారనుకుంటే మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్( India World Cup ) సమరం ఓటమితో ముగిసింది.

అయితే టీమిండియా ఓటమి పాలవడంతో అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా చాలా బాధపడ్డారు.కొందరు కన్నీటి పర్యంతమయ్యారు.విరాట్ కోహ్లీ ( Virat Kohli )కూడా తీవ్రమైన నిరుత్సాహానికి గురైయాడు.ఆ సమయంలో విరాట్‌కు ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ( Anushka Sharma ) అండగా నిలబడ్డారు.
విరాట్‌ను దగ్గరకు తీసుకుని ఎంతో ఉద్వేగంతో కౌగిలించుకుని ఓదార్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టీమ్ ఇండియా ఓటమి తర్వాత అనుష్క కూడా గుండె పగిలినట్లు కనిపించింది.అయితే, మ్యాచ్ తర్వాత ఆమె భర్త విరాట్‌కు పూర్తి మద్దతుగా నిలిచి ధైర్యాన్ని నింపేలా ఓదార్చింది.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడంతో ఇది కదా అసలైన ప్రేమ అంటే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇలాంటి సమయంలో భర్తకు ఇలా సపోర్ట్ చేయడం ఎంతో అవసరమని మరోకరు తెలిపారు.అనుష్క కూడా కొంచెం బాగోద్వేగానికి లోనైనట్టు కనిపిస్తూనే బయటకి కనిపించకుండా కవర్ చేసుకుంది.ఇక భారత్ ఓటమిపై సెలబ్రిటీలు కూడా బాధను వ్యక్తం చేశారు.