ఆ క్షణాలు మరిచిపోలేనివని అంటున్న అనుష్క.. ఏమైందంటే..?

విరుష్క దంపతులకు ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ విరుష్క జంట తమ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 Anushka Sharma Shares Lock Down Experiences In Social Media-TeluguStop.com

గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.హీరోహీరోయిన్లు షూటింగ్ లు లేక ఇంటికే పరిమితమైతే స్టార్ క్రికెటర్లు సైతం ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకున్న అనుష్క శెట్టి విరాట్ కోహ్లీ లాక్ డౌన్ సమయాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.లాక్ డౌన్ సమయంలో విరాట్, అనుష్క తమ పెంపుడు కుక్కలతో కలిసి కొన్ని గ్రామాలకు వెళ్లారు.

 Anushka Sharma Shares Lock Down Experiences In Social Media-ఆ క్షణాలు మరిచిపోలేనివని అంటున్న అనుష్క.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ జంట వెళ్లిన సమయంలో అక్కడికి పెద్ద సంఖ్యలో వీధి కుక్కలు వచ్చాయి.ఆకలితో ఉన్న కుక్కలను చూసి చలించిపోయిన విరుష్క జంట తమ దగ్గర ఉన్న అహారాన్ని కుక్కలకు ఇచ్చారు.

ఎంతో ప్రేమతో కుక్కలకు అనుష్క విరాట్ ఆహారం పెట్టగా తాజాగా అనుష్క శర్మ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆ క్షణాలు మరిచిపోలేనివంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనుష్క శర్మ షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైకులు వచ్చాయి.2020 సంవత్సరంలో గడిపిన కొన్ని స్పెషల్, బ్యూటిఫుల్ మూవ్ మెంట్స్ ఇవే అంటూ అనుష్క శర్మ చెప్పుకొచ్చారు.

మరోవైపు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ దంపతులకు ఇటీవలే ఒక ఆడపిల్ల పుట్టింది.

త్వరలో విరుష్క జంట పాప ఫోటోను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు.సోషల్ మీడియాలో విరాట్, అనుష్క దంపతులకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

అనుష్క సోషల్ మీడియా ద్వారా ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

#Anushka Sharma #LockDown #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు