తొమ్మిది నెలల గర్భంతో కూడా యాడ్ చేసిన అనుష్క

మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితానికి ఒక అందమైన అనుభూతి.దానిని వారు ఆశ్వాదిస్తూ ఉంటారు.

 Anushka Sharma New Ad Video With Pregnant, Bollywood, Celebrities Lifestyle, Vir-TeluguStop.com

ఈ అనుభూతి ఆశ్వాదించడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరూ అతీతులు కాదు.ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా గర్భం దాల్చిన తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి డెలివరీ అయ్యేంత వరకు చాలా శ్రద్ధగా ఉంటారు.

మెంటల్ గా, ఫిజికల్ గా వీక్ కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు.అయితే కొంత మంది సెలబ్రెటీలు మాత్రం దీనికి మినహాయింపు అని చెప్పాలి.

గర్భిణీగా ఉన్న సమయంలో ఓ వైపు మెడిటేషన్, యోగాతో వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది.

ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ఆమె భర్త విరాట్ తో కలిసి యోగా వర్క్ అవుట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది.మరో వైపు ఈ సమయంలో కూడా ఆమె ఒక యాడ్ షూట్ లో పాల్గొంది.

ఇప్పుడు ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Anushka Sharma, Bollywood, Lifestyle, Virat Kohli-Latest News - Telugu

ప్రెగ్నెన్సీ టెస్ట్ కి సంబందించిన కిట్ గురించి ఈ యాడ్ ఉంది.ఇందులో ఆమె సాంగ్స్ వింటూ ఉంటే గర్భంలో ఉన్న బేబీ ఆమెకి లంచ్ టైం అయ్యింది అని గుర్తు చేస్తుంది.దాంతో వెళ్లి లంచ్ చేయడానికి రెడీ అవుతుంది.

ఈ యాడ్ లో ఆమె తన మాతృత్వపు అనుభూతిని నేరుగా పంచుకుంటున్నట్లు ఉంది.అయితే కమర్షియల్ యాడ్స్ కోసం ఈ సమయంలో గర్భాన్ని వాడుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అని కొంత మంది ఆ యాడ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ ఉంటే.

గర్భంతో ఉన్నప్పుడు ఇంటి పట్టునే నిశ్శబ్దంగా, ఖాళీగా కూర్చొని ఉండటం కాదు.నచ్చిన పని చేస్తూ ఉండటం అని అనుష్క అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పింది అని కొంత మంది ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube