నిద్రలేని రాత్రులు గడుపుతున్న అనుష్క శర్మ.. కారణం ఎవరంటే?

బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించి అనుష్క శర్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రబ్ నే బనాదీ జోడీ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన అనుష్క శర్మ తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం.

 Anushka Sharma Latest Insta Post On Bachpan Ka Pyar Song-TeluguStop.com

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అనుష్క శర్మ గత కొంతకాలం నుంచి నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Anushka Sharma Latest Insta Post On Bachpan Ka Pyar Song-నిద్రలేని రాత్రులు గడుపుతున్న అనుష్క శర్మ.. కారణం ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం అనుష్క శర్మ ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా ఉండగా కూతురు పుట్టిన తర్వాత అనుష్క శర్మ మరింత బిజీ అవుతున్నారు.అనుష్క శర్మ తాజాగా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేయగా ఆ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజాగా బచ్ పన్ కా ప్యార్ హై పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఆ పాటను సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం రీల్స్ చేస్తున్నారు.

అయితే ఆ చిన్నోడి పాట వల్ల సరిగ్గా నిద్రపోవడం లేదని ఆమె అన్నారు.నిద్రపోయే సమయానికి అతడి పాట తనకు గుర్తుకు వస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.అనుష్క నవ్వుతూ ఆ బుడ్డోడి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జనవరిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన అనుష్క కూతురుకు వామిక అని పేరు పెట్టుకున్నారు.కూతురు పుట్టిన తర్వాత అనుష్క శర్మ మరింత సంతోషంగా ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుష్క శర్మ ఏదో ఒక విషయం గురించి స్పందించడంతో పాటు ఆ విషయాల గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అనుష్క శర్మ రీల్ చేయడంతో బుడ్డోడు మరింత పాపులర్ అయ్యాడు.

#Bachpan Ka Pyar #AnushkaSharma #Anushka Sharma #Insta #Vamika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు