సునీల్ గవాస్కర్ అభ్యంతర వ్యాఖ్యలు … అనుష్క అసహనం  

Anushka Sharma gives a befitting reply to Sunil Gavaskar, Bollywood, IPL, Virat Kohli, Anushka Sharma, Sunil Gavaskar - Telugu Anushka Sharma, Anushka Sharma Gives A Befitting Reply To Sunil Gavaskar, Bollywood, Ipl, Sunil Gavaskar, Virat Kohli

ఐపీఎల్ సిరీస్ ప్రస్తుతం కొనసాగుతుంది.దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల పట్ల క్రికెట్ ప్రేమికులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

TeluguStop.com - Anushka Sharma Gives A Befitting Reply To Sunil Gavaskar

చాలా కాలంగా క్రికెట్ కి మొహం వాచిపోయి చూస్తున్న క్రికెట్ లవర్స్ కి కరోనా టైంలో కాస్తా సేదతీరే అవకాశం ఐపీఎల్ ద్వారా లభించింది.ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మంది ఆటగాళ్లు వారి సామర్ధ్యం మేరకు రాణించలేకపోతున్నారు.

లాక్డౌన్ టైంలో ప్రాక్టీస్ పక్కన పెట్టి ఇంటికే పరిమితం కావడం వలన ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ లో వారి టాలెంట్ చూపించలేకపోతున్నారు.ఇందులో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు.

TeluguStop.com - సునీల్ గవాస్కర్ అభ్యంతర వ్యాఖ్యలు … అనుష్క అసహనం-General-Telugu-Telugu Tollywood Photo Image

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఒకప్పటి బ్యాటింగ్ ఫామ్ చూపించలేకపోవడంతో కామెంటరీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ కాస్తా అభ్యంతరకర వాఖ్యలు చేశారు.

విరాట్ కోహ్లీ లాక్ డౌన్ సమయంలో అనుష్క వేసే బంతులతో బ్యాటింగ్ ఆడి ఇక్కడ ఆట మరిచిపోయాడు అంటూ కాస్తా ద్వంద్వార్థం వచ్చే విధంగా మాట్లాడాడు.

ఈ మాటలపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా సునీల్ గవాస్కర్ పై తన అసహనం ప్రదర్శించింది.

భర్త ఆటకు భార్యపై ఆరోపణలు చేస్తారా, ఆడవాళ్ళని గౌరవించే పద్ధతి ఇదేనా, చాలా కాలంగా క్రికెట్ కామెంట్రీ చెబుతున్న మీరు ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించరా, ఇందులోకి నన్ను లాగి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తారా, గౌరవనీయులైన మీరు చేయాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించింది.మిస్టర్ గవాస్కర్ మీ సందేశం అసహ్యకరమైనది అంటూ తీవ్ర పదజాలం అనుష్క ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

అయితే గవాస్కర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో వాటిపై అతను క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.తాను అనుష్కపై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, వారిద్దరూ క్రికెట్ ఆడిన వీడియోని ఉద్దేశించి అలా మాట్లాడాను అని చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం గవాస్కర్ క్యారెక్టర్ కి జరగాల్సిన డామేజ్ గట్టిగానే జరిగింది అని చెప్పాలి.

#Anushka Sharma #AnushkaSharma #Virat Kohli #Sunil Gavaskar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Sharma Gives A Befitting Reply To Sunil Gavaskar Related Telugu News,Photos/Pics,Images..