అలా జరగడంతో కన్నీళ్లు ఆగలేదు.. అనుష్క కామెంట్స్ వైరల్..?

సినిమా రంగంలో అందం, అభినయం ఉన్నా కొంతమంది హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో సరైన సక్సెస్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అలా ఇబ్బందులను ఎదుర్కొన్న హీరోయిన్లలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఒకరు.

 Anushka Sharma Facing Problems In Her Initial Career , Anushka Comments Viral, A-TeluguStop.com

ఒకవైపు హీరోయిన్ గా సత్తా చాటుతూనే మరోవైపు అభిరుచి ఉన్న సినిమాలను నిర్మిస్తూ అనుష్క శర్మ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.నేడు అనుష్క శర్మ పుట్టినరోజు.

తాను కాలేజీలో చదువుకునే సమయంలో మోడలింగ్ పోటీలకు వెళితే తాను అందంగా లేనని కొంతమంది కామెంట్లు చేశారని ఆ కామెంట్ల వల్ల తాను చాలా బాధ పడ్డానని అనుష్క శర్మ చెప్పుకొచ్చారు.ఆ తరువాత కాలంలో తాను మోడల్ గా గుర్తింపును సంపాదించుకోగా రబ్ నే బనాది జోడీ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నటించే అవకాశం దక్కిందని అనుష్క శర్మ అన్నారు.

అయితే ఆ సినిమా తాను ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని అనుష్క శర్మ చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకు తాను ఫిలిం ఫేర్ అవార్డ్ వస్తుందని భావించానని కానీ ఫిలిం ఫేర్ అవార్డ్ కూడా రాలేదని అనుష్క శర్మ పేర్కొన్నారు.

ఆ సినిమాకు అవార్డ్ రాకపోవడంతో తనకు కన్నీళ్లు ఆగలేదని అనుష్క వెల్లడించారు.తన రెండో సినిమా కూడా విజయం సాధించలేదని అయితే మూడో సినిమా బ్యాండ్ బజా భారత్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపుతో పాటు విజయాలు వచ్చాయని అనుష్క తెలిపారు.

హీరోయిన్ గా అన్ని సినిమాల్లో నటించడం సాధ్యం కాదని ఆ కారణం వల్లే మనస్సుకు నచ్చిన సినిమాలను ఎక్కువగా నిర్మిస్తున్నానని అనుష్క తెలిపారు.దుస్తులు, ఫోజుల విషయంలో ఇతరుల జోక్యం అస్సలు నచ్చదని ఆమె అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube