పెళ్లి సమయంలో ఆ పని చేసిన అనుష్క.. అవాక్కైన కోహ్లీ..?

సాధారణంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు సినిమా రంగానికి చెందిన వారినే వివాహం చేసుకుంటూ ఉంటారు.అయితే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ వేర్వేరు రంగాలకు చెందిన సెలబ్రిటీలు అయినప్పటికీ ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

 Anushka Sharma  And Virat Kohli Used Fake Names To Keep Their Wedding A Secret ,-TeluguStop.com

అనుష్క, విరాట్ ఒక యాడ్ కోసం కలిసి పని చేయగా ఆ యాడ్ షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది.

అనుష్క, విరాట్ ఒకరితో మరొకరు ప్రేమలో ఉన్న సమయంలో వాళ్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఈ జంటను అభిమానులు విరుష్క అని ప్రేమగా పిలుచుకునేవారు.అయితే విరాట్ అనుష్క లవ్ స్టోరీ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.కోహ్లీ లవ్ స్టోరీ గురించి ఒక సందర్భంలో చెబుతూ ఒక షాంపూ యాడ్ షూటింగ్ సమయంలో తొలిసారి తాను అనుష్కను కలిసినట్లు వెల్లడించారు.

Telugu Anushka Sharma, Names, Virat Kohli, Secret-Movie

మేనేజర్ అనుష్క శర్మతో యాడ్ షూటింగ్ అని చెప్పగానే తనకు టెన్షన్ పట్టుకుందని అయితే మేనేజర్ మాత్రం కంగారు పడవద్దని యాడ్ కు సంబంధించిన స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని చెప్పారని తాను, అనుష్క కెరీర్ ను ఒకే సమయంలో మొదలుపెట్టడంతో పాటు ఒకే తరహా ఫ్యామీలీల నుంచి వచ్చామని పెళ్లి సమయంలో తాను బిజీగా ఉంటే అనుష్కనే పెళ్లి ఏర్పాట్లను చేసిందని కోహ్లీ తెలిపారు.

అయితే పెళ్లి సమయంలో మీడియా తమ పెళ్లి వార్తలను హైలెట్ చేయడానికి ప్రయత్నించడంతో అనుష్క విరాట్ కు బదులుగా ఫేక్ ఈమెయిల్ ఐడీతో రాహుల్ అనే పేరును క్రియేట్ చేసి ఆ పేరుతో పెళ్లి పనులు జరిపి మీడియా దృష్టిని మళ్లించారు.అలా మరో పేరుతో పెళ్లి పనులు చేసి కోహ్లీని సైతం అవాక్కయ్యేలా చేశారు.

ఈ జంటకు కొన్ని రోజుల క్రితం కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube