వామిక బర్త్ డే... విరాట్, అనుష్క వైన్ పార్టీ?

Anushka Sharma And Virat Kohli Celebrate Daughter Vamika First Birthday

బాలీవుడ్ జంట విరాట్ కోహ్లీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఈ జంట సౌత్ఆఫ్రికా టూర్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.

 Anushka Sharma And Virat Kohli Celebrate Daughter Vamika First Birthday-TeluguStop.com

విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ ఇద్దరూ కలసి అక్కడి లోకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అనుష్క, విరాట్ కోహ్లీ ల ముద్దుల కూతురు వామిక తొలి బర్త్ డే జనవరి 11న సౌత్ ఆఫ్రికా లో సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది.

 Anushka Sharma And Virat Kohli Celebrate Daughter Vamika First Birthday-వామిక బర్త్ డే… విరాట్, అనుష్క వైన్ పార్టీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వామిక పుట్టినరోజు వేడుకలు టీమిండియా సభ్యులతో కలసి ఈ దంపతులు ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే సెలబ్రేషన్స్ సమయంలో ఆ దంపతులిద్దరూ వైన్ గ్లాసులతో కెమెరాలకు ఫోజులు ఇచ్చారు.ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అనుష్క ఈ విధంగా రాసుకొచ్చింది.

సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు.లేలేత అందగాడిలా మెరిసిపోతున్నాడు.

టేబుల్ నిండుగా ఉంది.మా పాప కూడా అలా మారిపోయింది.

సాయంత్రం స్పెషల్ పార్టీచాలా బాగా జరిగింది అని అనుష్క తెలిపింది.

అలాగే ఆ జంట వాళ్ళ పాప బర్త్డేపార్టీకి విచ్చేసిన అతిధులందరికీ కృతజ్ఞతలు తెలిపింది.అనుష్క వామికను తన చేతుల్లోకి తీసుకుని తల్లిగా నవ్వుతూ తెగ మురిసిపోయింది.ఆ ఫోటోని ఉద్దేశించి నా పాప అని క్యాప్షన్ ఇచ్చింది.

అయితే బర్త్ డేకి సంబంధించిన ఫోటోల్ని ఎవరూ క్యాప్చర్ చేయవద్దని ముందుగానే హింట్ ఇచ్చేసారు.ఇది కేవలం పార్టీ సెలబ్రేషన్ మాత్రమేనని తెలుస్తోంది.

మొత్తానికి ఈ జంట వారి కూతురు వామిక ఫోటోలను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video : Anushka Sharma And Virat Kohli Celebrate Daughter Vamika First Birthday, Anushka Sharma, Virat Kohli, Vamika, Bollywood

#Anushka Sharma #Virat Kohli #Vamika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube