రెమ్యునరేషన్ పై అనుష్క సంచలన వ్యాఖ్యలు..!  

anushka sensational comments about her remuneration, Anushka Shetty, nishabdam movie Heroine, Remuneration, Tollywood, Telugu Film Industry - Telugu 15 Years Anushka Career, Anushka, Anushka Remuneration, Nishabdam

స్టార్ హీరోల, హీరోయిన్ల అభిమానుల్లో రెమ్యునరేషన్ గురించి ఎల్లవేళలా చర్చ జరుగుతుంది.కొందరు స్టార్ హీరోలు 50 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నారని, కొందరు హీరోయిన్లు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారని గాసిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి.

TeluguStop.com - Anushka Sensational Comments About Her Remuneration

అయితే స్టార్ హీరోలు, హీరోయిన్లు రెమ్యునరేషన్ గురించి పెద్దగా స్పందించరు కాబట్టి వైరల్ అవుతున్నా నిజనిజాలు ఎవరికీ తెలియవు.
తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్కకు రెమ్యునరేషన్ గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గతంలో రెమ్యునరేషన్ గురించి ప్రశ్నలు ఎదురైనా స్పందించని స్వీటీ తాజాగా తాను రెమ్యునరేషన్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని తెలిపింది.తాను సినిమాను ఎప్పుడూ వ్యాపార కోణంలో చూడనని వ్యాఖ్యలు చేసింది.

TeluguStop.com - రెమ్యునరేషన్ పై అనుష్క సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమాల విషయంలో పారితోషికం కంటే మనసు చెప్పిన మాటకే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించింది.
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదిహేను సంవత్సరాలు పూర్తైనా ఎప్పుడూ ప్లాన్ ప్రకారం సినిమాలను చేయాలనుకోలేదని తెలిపింది.

ఆనందాన్ని, ఆన్ స్క్రీన్ మ్యాజిక్ ఆస్వాదించడం కొరకు సినిమాలు చేస్తానని చెప్పింది.సినిమా కథ విన్న సమయంలో ఆ సినిమా కెరీర్ కు ఉపయోగపడుతుందా.? లేదా.? అనే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తానని.రెమ్యునరేషన్ లెక్కల గురించి తనకు పెద్దగా తెలియదని ఆమె వెల్లడించింది.

ఈ విధంగా ఆలోచించడం వల్లే తనకు కెరీర్ లో ఎన్నో విజయాలు దక్కాయని అనుష్క చెప్పింది.

సినిమా సక్సెస్ సాధిస్తే డబ్బు, స్టార్డం ఇచ్చే వాటి కంటే ఎక్కువ సంతృప్తి లభిస్తుందని పేర్కొంది.ఏ సినిమా అయినా మనస్సుకు నచ్చితే చాలని అంతకు మించి తానేం కోరుకోనని తెలిపింది.

ఈ నెల 2వ తేదీన అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.క్రిటిక్స్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకు భారీగా వ్యూస్ వచ్చాయని సమాచారం.

#Anushka #Nishabdam #15Years

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Sensational Comments About Her Remuneration Related Telugu News,Photos/Pics,Images..