అలాంటి సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన అనుష్క  

Anushka Says Will Never Do Historical Movies - Telugu Anushka, Epic Movies, Historical Movies, Telugu Gossips, Telugu Movie News

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది అందాల భామ అనుష్క.ఇప్పటికే అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి సినిమాలలో నటించిన అనుష్క తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Anushka Says Will Never Do Historical Movies

కాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు బాగా తగ్గించింది అనుష్క.ఇప్పుడు ఇదే విషయాన్ని స్వీటీ కూడా ఒప్పుకుని తన తప్పును దిద్దుకునేందుకు సిద్ధమయ్యింది.

ఎక్కువగా చారిత్రాత్మక సినిమాలు చేయడం వలన ఇతర సినిమా అవకాశాలు కోల్పోయానంటూ అనుష్క చెప్పుకొచ్చింది.అయితే ఈ సినిమాల కోసం అనుష్కకు ఎక్కువ సమయం పడుతుందని, మేకప్ విషయంలోనూ చాలా సమయం తీసుకుంటుండటంతో భవిష్యత్తులో చారిత్రాత్మక సినిమాలు చేయకపోవచ్చంటూ అనుష్క వెల్లడించింది.

ఇలా హిస్టారికల్ సినిమాలకు దూరం అవుతున్నానంటూ చెప్పుకొచ్చిన అనుష్క నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తే, మరికొందరు ఆమె చారిత్రాత్మక సినిమాలు చేయాల్సిందే అంటూ వెనకేసుకొచ్చారు.

ఏదేమైనా తన నిర్ణయం కొంతమందికి నచ్చకపోవచ్చంటూ అనుష్క క్లారిటీ కూడా ఇచ్చింది.

ఇకపోతే అనుష్క ప్రస్తుతం నిశబ్ధం అనే సినిమాలో నటిస్తోంది.మాధవన్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో అనుష్క మూగమ్మాయిలా నటించనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test