టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ను రిలీజ్కు రెడీ చేస్తోంది.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకునేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతోంది.
కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.అయితే ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తోంది.
కాగా అనుష్క తన నెక్ట్స్ సినిమా కోసం కథలు వింటున్నట్లు తెలుస్తోంది.టాలీవుడ్లో పలు కథలు విన్నా ఆమెను మెప్పించలేకపోయాయి.
అయితే తమిళంలో తెరకెక్కి తెలుగులో రిలీజ్ అయిన ‘రాఘవన్’ అనే సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.లోకనాయకుడు కమల్ హాసన్, అందాల భామ జ్యోతిక కలిసి ఈ సినిమాలో నటించారు.
స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తుండగా, ఇప్పుడు ఈ సీక్వెల్ చిత్రంలో హీరోయిన్గా అనుష్కను సెలెక్ట్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు.
మరి ఈ సినిమాలో అనుష్క ఎలాంటి పాత్రలో నటిస్తుంది, అసలు ఈ సినిమాను అనుష్క ఓకే చేస్తుందా లేదా అనేది చూడాలి.