తమిళంలో ఇటీవల రిలీజ అయ్యి ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’.ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సూపర్ హిట్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యి పలు భాషల్లో రీమేక్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాను తెలుగులోనూ స్టార్ హీరో వెంకటేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.
ఈ రీమేక్ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండటంతో టాలీవుడ్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి.
బ్రహ్మోత్సవం వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాతో మాయమైన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ‘అసురన్’ వంటి మాస్ కంటెంట్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరైతే బాగుంటుందా అని అందరూ అనుకుంటుండగా స్వీటీ అనుష్క శెట్టి పేరు వినిపించింది.
దీంతో ఆమెను చిత్ర యూనిట్ సినిమాలో నటించాల్సిందిగా సంప్రదించారు.
అయితే కారణం ఏమిటో తెలియదు కాని అనుష్క మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.
వెంకటేష్‌తో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడెందుకు రిజెక్ట్ చేసిందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.ఏదేమైనా వెంకటేష్ లాంటి హీరోతో సినిమాను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ్ హల్చల్ చేస్తోంది.