కమల్ హసన్ కి జోడీగా అనుష్క! కోలీవుడ్ హాట్ టాపిక్  

Anushka Ready To Romance With Kamal Haasan In Kollywood - Telugu, Gowtham Menon, South Cinema, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సౌత్ సినిమాలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో నయనతార తర్వాత స్థానంలో ఉంది.అయితే నయనతార 15 ఏళ్ల తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

 Anushka Ready To Romance With Kamal Haasan In Kollywood - Telugu Gowtham Menon South Cinema Tollywood

ఇక అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే పాన్ ఇండియా మూవీ చేస్తుంది.ఈ అమ్మడు మార్కెట్ రేంజ్ 50 కోట్లు పైనే ఉంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమా తర్వాత ఆమె చేయబోయే సినిమాల మీద ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

 Anushka Ready To Romance With Kamal Haasan In Kollywood - Telugu Gowtham Menon South Cinema Tollywood

ఆమె ఏ సినిమా చేసిన కచ్చితంగా దానికి మంచి మార్కెట్ దొరుకుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క కోలీవుడ్ నుంచి భారీ ఆఫర్ ని సొంతం చేసుకుంది.

స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్ మరల తన సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్ తీసే ప్రయత్నంలో ఉన్నారు.అందులో ముందుగా కమల్ హసన్ తో గతంలో తీసిన రాఘవన్ సినిమాకి సీక్వెల్ సిద్ధం చేశారు.

ఈ సినిమా కథని కూడా సిద్ధం చేసి కమల్ హసన్ ని విపించడం జరిగింది.దానికి కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భారతీయుడు సినిమా ఫినిష్ చేసిన వెంటనే రాఘవన్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంది.ఇందులో కమల్ హసన్ కి జోడీగా కీలకమైన పాత్రలో అనుష్కని ఫైనల్ చేశారు.

కథ విని అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మరి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనేది అధికారికంగా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

Anushka Ready To Romance With Kamal Haasan In Kollywood Related Telugu News,Photos/Pics,Images..