అనుష్క ఇక పెళ్లి పీటలు ఎక్కాల్సిందేనా! సందిగ్ధంలో కెరియర్  

Anushka Ready To Marry After Nisabdham Movie-nisabdham Movie,south Cinema,tollywood

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి స్వీటీ అనుష్క.తెలుగులో సుమారు స్టార్ హీరోలందరితో ఆడిపాడిన ఈ భామ ఇక విజయశాంతి తర్వాత టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

Anushka Ready To Marry After Nisabdham Movie-Nisabdham Movie South Cinema Tollywood

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో అనుష్క టాప్ లో ఉంది.బాహుబలి, బాగమతి సినిమాలతో తాను స్టార్ అని ప్రూవ్ చేసుకుంది.

ఇక సోలోగా కూడా ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతో సమానంగా తన సినిమాకి కావాల్సిన మార్కెట్ ని తెచ్చుకోగలనని నిరూపించుకున్న ఈ భామ ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది.భారీ కాస్టింగ్ తో హాలీవుడ్ నటులతో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

అయితే ఏవో కారణాల వలన రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ఈ సినిమా తర్వాత అనుష్క చేతిలో చెప్పుకోతగ్గ స్థాయిలో సినిమాలు లేవు.

దానికి తోడు ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ దూసుకొస్తున్నారు.అయితే నయనతార స్థాయిలో బాడీ మెయింటేన్ చేయకపోవడంతో అనుష్క కాస్తా బొద్దుగా తయారైంది.

నిశ్శబ్దం సినిమా కోసం కాస్తా ఒళ్ళు తగ్గించిన ఒకప్పటి స్థాయిలో లేదు.మరో వైపు దర్శకులు స్టార్ హీరోలకి కాంబినేషన్ గా సీనియర్ హీరోయిన్స్ ని తీసుకోవడం లేదు.

ఫ్రెష్ పేస్ కోసం చూస్తున్నారు.అలాగే కథల విషయంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి.

ఇక సోలోగా సినిమాలు చేయాలన్నా అనుష్కకి సరిపోయే కథలు రావాలంటే ఏడాదికి ఒకటి అర సినిమాలు తప్ప రావు.ఇలాంటి పరిస్థితిలో కెరియర్ సందిగ్ధంలో పడిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

ఇప్పటికే అనుష్కకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో నిశ్శబ్దం సినిమా తర్వాత ఈ భామ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

.

తాజా వార్తలు

Anushka Ready To Marry After Nisabdham Movie-nisabdham Movie,south Cinema,tollywood Related....