అనుష్క సినిమాపై నిశ్శబ్ధం ఎందుకో?  

Anushka Nishabdham Movie To Have OTT Release, Anushka, Nishabdham, OTT, Tollywood News - Telugu Anushka, Nishabdham, Ott, Tollywood News

టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ పలు కారణాల వల్ల వరుసగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమాను ఎట్టకేలకు వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

 Anushka Nishabdham Movie To Have Ott Release

కానీ వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు జల్లింది.ఈ సినిమా రిలీజ్‌కు మరోసారి బ్రేకులు పడ్డాయి.

దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనుష్క సినిమాపై నిశ్శబ్ధం ఎందుకో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.

ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో నిశ్శబ్ధం చిత్రం అసలు ఇప్పట్లో రిలీజ్ అవుతుందా అని అనుష్క ఫ్యాన్స్ అంటున్నారు.అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ భారీ ఆఫర్లు చిత్ర యూనిట్‌కు అందుతున్నాయి.

దీంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.గతంలోనే ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయబోమని చిత్ర యూనిట్ తెలిపింది.

కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు.కాగా ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా, ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారట.

మరి నిశ్శబ్ధం చిత్రం నేరుగా ఓటీటీలో ప్రత్యక్షమవుతుందా లేదా అనేది చూడాలి.ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం చేస్తే బాగోదని చిత్ర యూనిట్ భావిస్తోందట.

#OTT #Anushka #Nishabdham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Nishabdham Movie To Have Ott Release Related Telugu News,Photos/Pics,Images..