రివ్యూ : అనుష్క 'నిశ్శబ్దం' భరించలేం

అనుష్క దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత నిశ్శబ్దం సినిమాతో వచ్చింది.మాధవన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి మరియు శాలిని పాండే కూడా నటించారు.

 Anushka Nishabdam Telugu Movie Review  Anushkha, Nishbddam, Nishbddam Movie Revi-TeluguStop.com

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించారు.గత ఏడాది కాలంగా ఈ సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

అనుష్క ఈ సినిమాలో చెవిటి మూగ అమ్మాయిగా కనిపించడంతో పాటు చాలా విభిన్నమైన కథ అంటూ ప్రచారం చేయడంతో అంతా కూడా సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.సినిమా కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ప్రచారం చేశారు.

సినిమాను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇక సినిమాను విడుదల చేయకుంటే క్రేజ్ తగ్గుతుందనే ఉద్దేశ్యంతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

అమెజాన్ ప్రైమ్‌ ద్వారా అర్ధరాత్రి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వస్తుంది.ఇలాంటి సినిమాలు సినిమా థియేటర్ అయితే కాస్త థ్రిల్లింగ్‌ గా అనిపిస్తాయి ఏమో కానీ టీవీల్లో లేదా మొబైల్లో చూస్తుంటే మాత్రం ఏమాత్రం ఆసక్తి లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

అనుష్క నటన మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా బాగాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో అనుష్క నిశ్శబ్దం సినిమా పై భారీగా కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా ఇన్ని రోజులు వాయిదా వేసి తప్పు చేశారని విమర్శలు రావడంతో పాటు దీనికి ఇంతగా పబ్లిసిటి చేయడం విడ్డూరంగా ఉందని మరి కొందరు ఆరోపిస్తున్నారు.మొత్తానికి అనుష్క చాలా కష్టపడి చేసిన ఈ సినిమా నిరాశపరిచింది.

ఈ సినిమా కోసం ఆమె దాదాపు రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేసింది.మరో సినిమాకు కూడా కమిట్ కాకుండా అనుష్క ఈ సినిమా చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదో మామూలు సినిమా అయినా అనుష్క ఎందుకు ఇంత నమ్మకం పెట్టుకుంది.మొత్తానికి సినిమా నిరాశపరచడంతో అనుష్క అభిమానులు తదుపరి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

అమెజాన్ లో విడుదలైన మరో సినిమా నిరాశపరిచింది.ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు వరుసగా నిరాశ పర్చుతున్నాయి.

దాంతో ఓటీటీ లో విడుదల చేసేందుకు మేకర్స్ వెనక ముందు ఆడుతున్నారు.ఇప్పటికే ఓటీటీ ద్వారా వచ్చే సినిమాలు సక్సెస్ అవ్వడం లేదు అంటూ సెంటిమెంట్ ఉంది ఇప్పుడు సెంటిమెంట్ ను ఇది మరింత బలపరిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube