ఈ రెండు సినిమాలు సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాయా?  

anushka nishabdam and raj tarun orey bujjiga movies releasing in ott, Nani, V, Amzon Prime, OTT, Anushkha Shetty, Nishabddam, Raj Tarun, Orey Bujjiga, - Telugu Aha Ott, Anushka, Nishabdam, Orey Bujjiga, Telugu Film News

కరోనా కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి.దాంతో విడుదలకు సిద్దంగా ఉన్న పలు సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి.

TeluguStop.com - Anushka Nishabdam And Raj Tarun Orey Bujjiga Movies Releasing In Ott

ఇంకా చాలా కాలం విడుదల వాయిదా వేస్తూ వస్తే నిర్మాతలకు ఆర్థిక భారం మరింత ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో చిన్న సినిమాలను మీడియం రేంజ్‌ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.అందుకు సంబంధించి ఇప్పటికే పలు సినిమాల ప్రకటనలు వచ్చాయి.

కొన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఓటీటీలో విడుదల అయిన సినిమాల్లో ఎక్కువ శాతం నిరాశ పర్చడంతో కొత్త సినిమాలను విడుదల చేయాలంటే కాస్త వెనుకంజ వేస్తున్నారు.

TeluguStop.com - ఈ రెండు సినిమాలు సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాయా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే విడుదల అయిన సినిమాల విషయంలో ప్రేక్షకులు పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసిన దాఖలాలు లేవు.ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒరేయ్‌ బుజ్జిగా మరియు నిశ్శబ్దం సినిమాలు విడుదల కాబోతున్నాయి.

అందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావడం సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం కూడా జరుగుతోంది.ఒరేయ్‌ బుజ్జిగా సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేయాలనుకున్నా ఒక రోజు ముందే అంటే రేపు ఆహా ద్వారా విడుదల చేయబోతున్నారు.

ఇక నిశ్శబ్దం సినిమాను అమెజాన్‌ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమాల ఓటీటీ విడుదలను నిర్ణయించబోతున్నాయి.

ప్రస్తుతం చిన్నా పెద్ద కలిసి దాదాపు పది సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి వాటిని విడుదల చేసేది లేనిది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఓటీటీలో విడుదల అయితే ఫ్లాప్‌ తప్పదు అనే నమ్మకం కొందరిలో ఉంది.అందుకే ఈ రెండు సినిమాల ఫలితం ఎలా ఉంటుంది అనేది అందరికి ఆసక్తికరంగా ఉంది.

#Aha OTT #Nishabdam #Anushka #Orey Bujjiga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Nishabdam And Raj Tarun Orey Bujjiga Movies Releasing In Ott Related Telugu News,Photos/Pics,Images..