భాగమతిని బుక్ చేసిన యూవీ..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క ప్రస్తుతం తన తాజా చిత్రం నిశబ్ధం రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.పూర్తి సస్సెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క ఓ మూగ, చెవిటి అమ్మాయిగా నటిస్తుంది.

 Anushka Locked For Uv Creations Next Movie-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీ విషయంలో అనుష్క అడుగులు వేస్తోంది.

ఇప్పటికే ప్రెస్టీజియస్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్‌తో ఓ సినిమా చేసేందుకు అనుష్క ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో గతంలో భాగమతి వంటి బ్లాక్‌బస్టర్‌లో అనుష్క నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో మూవీ ద్వారా అనుష్కతో కలిసి ఈ ప్రొడక్షన్ హౌజ్‌ అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తోంది.

మరి ఈ కాంబోలో రాబోయే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే అంశం కూడా చాలా ఆసక్తిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube