నిశ్శబ్దం కోసం అనుష్క చాలా గొప్ప పని చేసింది! రివీల్ చేసిన దర్శకుడు  

Anushka learn International Sign Language For Nishabdham, Tollywood, Telugu Cinema, Pan India Movie, Hemant Madhukar, Hero Madhavan - Telugu Anushka Shetty, Hemant Madhukar, Hero Madhavan, Nishabdham, Nternational Sign Language, Pan India Movie, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఆవిష్కరించబడిన ఈ సినిమా అన్ని అడ్డంకుల తర్వాత అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.

TeluguStop.com - Anushka Learn International Sign Language For Nishabdham

ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది.

థియేటర్లు మూతబడి ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో నిర్మాతలు ఓటీటీవైపు వచ్చారు.ఇదిలా ఉంటే తాజాగా చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలని మీడియాతో పంచుకున్నాడు.

TeluguStop.com - నిశ్శబ్దం కోసం అనుష్క చాలా గొప్ప పని చేసింది రివీల్ చేసిన దర్శకుడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

హేమంత్ మధుకర్ కెరియర్ లో చేస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.అలాగే అతని మొదటి సినిమా సలీమ్ మంచు విష్ణు కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ అయినా కథ మీద ఉన్న నమ్మకం కొద్ది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాపై భారీగానే ఖర్చు పెట్టింది.

ఇదిలా ఉంటే దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా క‌నిపించ‌డంతో పాటు ఆడియెన్స్‌కి కొంతమెర ఫ్రెష్ ఫీల్ రావ‌డానికి ఈ సినిమాను అమెరిక‌న్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందించాము.అలానే ఈ సినిమాలో అనుష్క కూడా అమెరిక‌న్ బార్న్ ఇండియ‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

అలానే అన్ని ముఖ్య పాత్ర‌లు కూడా అమెరికా నేప‌థ్యంలోనే ఉంటాయి, ఇక హాలీవుడ్ న‌టుడు మైఖ‌ల్ మ్యాడిస‌న్‌ని కూడా ఒరిజినాలిటీ మిస్ అవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోవ‌డం జ‌రిగింది.అనుష్కకి ఉన్న ఫేమ్‌తో పోల్చుకుంటే నేను చిన్న ద‌ర్శ‌కుడిని.

అయితే ఆమె మాత్రం ఇవేమి ప‌ట్టించుకోకుండా ప్ర‌తిదీ అడిగి తెలుసుకుని న‌టించారు.ఈ సినిమా కోసం అమె ఏకంగా ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు.

అలానే మాధ‌వ‌న్ కూడా త‌న పాత్ర కోసం చాలా ప్రిప‌రేష‌న్ తీసుకున్నారు.అంజలి కూడా అమెరికన్ కాప్ గా కనిపించడానికి ఫిట్ నెస్, బాడీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారని చెప్పుకొచ్చాడు.

మరి అనుష్క ఇంత కస్టపడి చేసిన ఈ సినిమా ఆమెకి ఏ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.

#Hero Madhavan #Hemant Madhukar #Anushka Shetty #Nishabdham #Pan India Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anushka Learn International Sign Language For Nishabdham Related Telugu News,Photos/Pics,Images..