చిరు హీరోయిన్‌ కన్ఫర్మ్‌

మెగా స్టార్‌ చిరంజీవి 150వ సినిమా చివరి సారి కన్ఫర్మ్‌ అయ్యింది.ఇన్నాళ్లుగా ఎన్నో సార్లు కన్ఫర్మ్‌ అయినా కూడా ఈసారి పూర్తి కన్ఫర్మ్‌.

 Anushka In Chiranjeevi 150 Movie-TeluguStop.com

తాజాగా రామ్‌చరణ్‌ చిరు 150వ సినిమాపై అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘కత్తి’ చిత్రం రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నాడు.

విజయ్‌ హీరోగా, సమంత హీరోయిన్‌గా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దాంతో చిరంజీవి ఈ సినిమాపై ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది.

వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుండగా, హీరోయిన్‌ విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

చిరంజీవి 150వ సినిమా అంటే చాలా ప్రత్యేకం.

అందుకే ఈ సినిమాలో ప్రత్యేకమైన హీరోయిన్‌ను ఎంపిక చేయాలని వినాయక్‌ భావిస్తున్నాడు.టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా స్వీటి అనుష్క నటించే అవకాశాలున్నాయి.

గతంలో ‘స్టాలిన్‌’ సినిమాలో అనుష్క చిరంజీవి జోడీగా ఐటెం సాంగ్‌ చేసిన విషయం తెల్సిందే.ఇప్పుడు టాలీవుడ్‌లో అనుష్కది టాప్‌ పొజీషన్‌.

అందుకే హీరోయిన్‌గా చిరంజీవికి జోడీగా అనుష్క అయితే పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ అని మెగా ఫ్యామిలీ సన్నిహితులు భావిస్తున్నారు.వచ్చే నెలలో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

అదే సమయంలో హీరోయిన్‌ ఎవరు అనేది కూడా క్లారిటీ రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube